E-Paper
Advertisement

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!
Advertisement

Centralised AC: ఇల్లంతా ఒకేసారి చల్లగా, హాయిగా మార్చడంలో సెంట్రలైజ్డ్ ఏసీలు (Centralised AC) ముఖ్య భూమిక పోషిస్తాయి. సాధారణంగా విండో, స్ప్లిట్ ఏసీలు ఒక గదికి మాత్రమే పరిమితమైతే.. ఈ సెంట్రల్ ఏసీలు మాత్రం ఇంటి మెుత్తానికి సమానంగా కూలింగ్ ను అందిస్తాయి. అయితే వీటిని కొనుగోలు చేసే విషయంలో చాలా మందిలో అనేక రకాల సందేహాలు, అనుమానాలు సహజంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో సెంట్రలైజ్డ్ ఏసీ వల్ల లాభనష్టాలు ఏంటి? ఖర్చులు ఎలా ఉంటాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్లస్ పాయింట్స్

సెంట్రలైజ్డ్ ఏసీలు.. ఇల్లంతా ఒకేలాంటి చల్లదనం అందిస్తాయి. స్ప్లిట్ ఏసీల లాగా కేవలం ఒక గదికే పరిమితం కాకుండా ఇల్లంతా ఒకే విధమైన టెంపరేచర్ ను మెయిన్ టెన్ చేస్తాయి. పైగా వీటిని ఫిక్స్ చేసేందుకు స్ప్లిట్ ఏసీల తరహాలో గోడలకు పెద్ద పెద్ద రంధ్రాలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇతర ఏసీల్లాగా ఇది సెంట్రలైజ్డ్ ఏసీలు బయటకు కనిపించవు. కేవలం సీలింగ్‌లో చిన్న డక్ట్ గ్రిల్స్ మాత్రమే కనిపిస్తాయి. దీనికి సంబంధించిన మెయిన్ కంప్రెషర్ యూనిట్ ఇంటి పైనో లేదా బయటో ఉండటం వల్ల ఇంట్లో అస్సలు శబ్దం రాదు. దీంతోపాటు ఇందులో ఉండే అధునాతన ఫిల్టర్లు గాలిలోని దుమ్ము, ధూళిని సమర్థవంతంగా శుద్ధి చేస్తాయి.

మైనస్ పాయింట్స్

Advertisement

సెంట్రలైజ్డ్ ఏసీ వల్ల కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒకే ఒక్క గదిలో ఉన్నప్పుడు కూడా ఇల్లంతా కూలింగ్ రన్ అవ్వడం వల్ల విద్యుత్ వినియోగం, బిల్లులు భారీగా పెరుగుతాయి. మరోవైపు వీటి క్లీనింగ్, సర్వీసింగ్ ప్రక్రియ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఎక్కడైనా చిన్న లీకేజీ వచ్చినా సీలింగ్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. సెంట్రల్ ఏసీలో ఏదైనా సమస్య వస్తే ఇల్లంతా ఒకేసారి ఉక్కపోతగా మారిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఖర్చు పరంగా చూస్తే..

సాధారణ స్ప్లిట్ ఏసీలతో పోలిస్తే సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటుకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువని నిపుణులు అంటున్నారు. ఇంటి సైజ్, టన్నుల కెపాసిటీని బట్టి 3 BHK లేదా అంతకంటే పెద్ద ఇంటికి కనీసం రూ.3 లక్షల నుండి రూ.7 లక్షల వరకు ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. కాబట్టి సాధారణ స్ప్లిట్ ఏసీలతో పనికాదని భావించినప్పుడు.. నేరుగా సెంట్రలైజ్డ్ ఏసీని తీసుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

ఈ ఏసీలు ఎవరికి బెస్ట్?

పెద్ద విల్లా లేదా 3000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం గల ఇల్లు ఉంటే.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇల్లు నిర్మాణ దశలోనే దీనిని ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాకాకుండా ఇప్పటికే పూర్తయిన ఇళ్లల్లో సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నదని స్పష్టం చేస్తున్నారు. దీనిని ఫిక్స్ చేసేందుకు సీలింగ్ ను పగలగొట్టాల్సి రావొచ్చని పేర్కొంటున్నారు.

Also Read: Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×