E-Paper
Advertisement

Samsung Galaxy A57: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. 50MP కెమెరాతో వస్తోన్న కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే!

Samsung Galaxy A57: బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. 50MP కెమెరాతో వస్తోన్న కొత్త శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే!
Advertisement

Samsung Galaxy A57: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన పాపులర్ A సిరీస్‌లో భాగంగా Samsung Galaxy A57ను మార్కెట్‌లో దించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలు అధికారికంగా వెలువడక ముందే.. దీని ఫీచర్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ A57 హ్యాండ్ సెట్ చాలా సన్నగా, స్టైలిష్‌గా ఉండబోతోందని, ఈ సిరీస్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో విడుదల కావచ్చని తాజా లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

కళ్లు చెదిరేలా డిస్‌ప్లే..

Samsung Galaxy A57 ఫోన్‌.. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ తోడవడంతో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడుతున్నప్పుడు మెరుగైన పనితీరును అందిస్తుందని చెబుతున్నారు టెక్ నిపుణులు. ఇక పనితీరు విషయానికి వస్తే.. దీనిలో శక్తివంతమైన Exynos 1680 ఆక్టా‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ A57.. 256GB భారీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది.

Advertisement

Also Read: మాట్లాడక్కర్లేదు.. సైగ చేయక్కర్లేదు.. మీ రాకను గుర్తించి చక చకా పనులు చేసే అమెజాన్ కొత్త డివైజ్!

సాఫ్ట్‌వేర్‌లో లేటెస్ట్..

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో వెనుక వైపు మూడు కెమెరాలను అమర్చారు. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 12MP అల్ట్రా వైడ్, 5MP మాక్రో లెన్స్‌లు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం అయితే 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16, శాంసంగ్ సొంత One UI 8 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది. ఇకపోతే.. భద్రత కోసం స్క్రీన్‌పైనే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

బ్యాటరీ బ్యాకప్, ఇతర ఫీచర్లు:

Advertisement

ఈ ఫోన్‌ను రోజంతా వాడినా.. ఛార్జింగ్ త్వరగా అయిపోకూడదని 5000mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండటంతో ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP67 రేటింగ్, స్పష్టమైన సౌండ్ క్వాలిటీ కోసం స్టీరియో స్పీకర్లను ఇచ్చారు. శాంసంగ్ నుంచి విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రానప్పటికీ.. కొన్ని రోజుల్లోనే బడ్జెట్ ధరలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుందని సమాచారం.

Also Read: డిస్‌ప్లే అద్భుతం.. ఫీచర్లు అమోఘం.. మోటో G67, మోటోG77 త్వరలో విడుదల!

 

 

 

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×