E-Paper
Advertisement

Samsung Galaxy F05 : సూపర్ సేల్ బాస్.. రూ. 6,499కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్

Samsung Galaxy F05 : సూపర్ సేల్ బాస్.. రూ. 6,499కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్
Advertisement

Samsung Galaxy F05 :  ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సాంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ సెప్టెంబర్‌ నెలలో విడుదలైంది. అధునాతన ఫీచర్స్ తో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ ఫోన్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో లాంఛ్ అయింది. అయితే ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ పై ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ సేల్‌ 2024లో భారీ డిస్కౌంట్ నడుస్తుంది. కేవలం  రూ.6,499 ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సేల్ లో ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, మెుబైల్స్ పై బెస్ట్ సేల్ నడవగా.. స్మార్ట్ గ్యాడ్జెట్ ప్రియలు వాటిని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సేల్ లో కొన్ని మెుబైల్స్ పై ఫైనల్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. అతి తక్కువ ధరకే సూపర్ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక సామ్ సాంగ్ తాజాగా లాంఛ్ చేసిన గెలాక్సీ F05 పై భారీ తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ పై మీరు ఓ లుక్కేయండి.

Advertisement

స్టోరేజీ – సామ్ సాంగ్ గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీతో లాంఛ్ అయింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ సేల్‌ 2024 లో రూ.6499కే అందుబాటులో ఉంది.

డిస్ ప్లే – స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక 720*1600 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 60 Hz రిఫ్రెష్‌ రేటుతో అందుబాటులో ఉంది.

Advertisement

హ్యాండ్ సెట్ – ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ సైతం ఆకట్టుకునే విధంగా లెదర్‌ ఫినిష్‌తో అందుబాటులోకి వచ్చింది.

ప్రోసెసర్ – మీడియా టెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌ తో శాంసంగ్‌ గెలాక్సీ F05 స్మార్ట్‌ ఫోన్‌ పనిచేస్తుంది.

కెమెరా – గెలాక్సీ F05 స్మార్ట్‌ఫోన్‌ లో డ్యూయల్‌ కెమెరా ఉంది. 50MP ప్రధాన కెమెరా సహా 2 MP డెప్త్‌ కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8 MP కెమెరాను అమర్చారు. ఇక  ముందు వైపు వాటర్‌ డ్రాప్‌ నాచ్‌ డిజైన్‌ను కలిగి ఉంది.

బ్యాటరీ – ఛార్జింగ్ బ్యాటరీ పరంగా ఈ స్మార్ట్ ఫోన్ లో మెరుగైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 25W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీను కలిగి ఉంది. USB-C ఛార్జింగ్ పోర్ట్ తో ఉంది. హై సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌  కూడా ఉంది.

ఈ హ్యాండ్‌సెట్ స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత One UI 5 OS పై ఆధారపడి ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది. రెండు OS అప్‌డేట్స్, 4 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్ పొందనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ హ్యాండ్‌ సెట్‌ ట్విలైట్‌ బ్లూ కలర్ లో లభిస్తుంది.

ఆఫర్స్ – ఇక సేల్‌లో భాగంగా యెస్‌ బ్యాంక్‌, BOB కార్డు, యాక్సెస్‌ బ్యాంక్‌, RBL కార్డుల ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్స్ కు 10 శాతం వరకూ డిస్కౌంట్‌ లభిస్తుంది.

ALSO READ : హైవేపై లాంగ్ జర్నీ చేస్తున్నారా? – ఇది మీతో ఉంటే ఫుల్ సేప్​!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×