BigTV English

Salman Khan: ప్రాణభయంతో ‘బిగ్ బాస్‌’కు దూరం.. సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం

Salman Khan: ప్రాణభయంతో ‘బిగ్ బాస్‌’కు దూరం.. సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం

Salman Khan Bigg Boss: తాజాగా హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 ప్రారంభమయ్యింది. ఎప్పటిలాగానే సల్మాన్ ఖాన్.. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడానికి ముందుకొచ్చాడు. బిగ్ బాస్ 18 ప్రారంభమయ్యి వారం రోజులే అయ్యింది. ఇంతలోనే ఆ షోలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ వారమంతా కంటెస్టెంట్స్ ఎలా ఆడారు? వారు చేసిన ఒప్పులేంటి? తప్పులేంటి? అని చెప్పడం కోసం మొదటి వీకెండ్ ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ ఎంటర్ అవ్వాలి. కానీ ఉన్నట్టుండి చివరి నిమిషంలో శనివారం జరగాల్సిన బిగ్ బాస్ షూటింగ్‌ను క్యాన్సెల్ చేశాడు సల్మాన్ ఖాన్. దాని వెనుక బలమైన కారణమే ఉన్నట్టు తెలుస్తోంది.


పొలిటీషియన్ హత్య

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రాణానికి ప్రమాదం ఉందని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అందుకే గత కొంతకాలంగా తను భారీ సెక్యూరిటీ మధ్య తిరుగుతున్నాడు. తాజాగా పొలిటీషియన్ బాబా సిద్ధికీ మర్డర్.. సల్మాన్‌ను షాక్‌కు గురిచేసింది. అజిత్ పవార్‌కు తోడుగా ఎన్సీపీలో జాయిన్ అయ్యారు బాబా సిద్ధికీ. ఇటీవల ముంబాయ్‌లోని బాండ్రా ఏరియాలోని నిర్మల్ నగర్ కోల్గేట్ గ్రౌండ్ వద్ద ఉండే తన కుమారుడు, ఎమ్మెల్యే అయిన జీషాన్ సిద్ధికీని కలవడానికి వెళ్లారు బాబా సిద్ధికీ. ఆ ఇంటి బయటే ఆయనపై కాల్పులు జరిపారు దుండగులు. ఒక పొలిటీషియన్‌పై ఇలాంటి హత్యాయత్నం జరగడం రాజకీయ సర్కిల్స్‌లోనే కాదు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.


Also Read: నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా.. హీరో షాకింగ్ స్టేట్‌మెంట్

చాలా ఫేమస్

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్‌లో ఉండగా బాబా సిద్ధికీపై జరిగిన దాడి గురించి తెలిసింది. దీంతో అక్కడికక్కడే షూటింగ్ ఆపేసి వెంటనే ఆయనను చూడడానికి ముంబాయ్‌లోని లీలావతి హాస్పిటల్‌కు బయల్దేరాడు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కూడా బాబా సిద్ధికీని చూడడానికి లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నాడు. ముఖ్యంగా సల్మాన్, బాబా సిద్ధికీ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. సల్మాన్ ఖాన్ ఉంటున్న ఏరియాకు సంబంధించిన నియోజకవర్గంలోనే బాబా సిద్ధికీ పనిచేస్తున్నారు. బాబా సిద్ధికీ నిర్వహించే ఇఫ్తార్ పార్టీలు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఆయన నిర్వహించిన ఇఫ్తార్ పార్టీల్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా జరుగుతుంటాయి.

గొడవలకు ఫుల్ స్టాప్

2013లో బాబా సిద్ధికీ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలోనే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కలుసుకున్నారు. అంతకు ముందు చాలాకాలం వరకు ఈ ఇద్దరి హీరోల మధ్య కోల్డ్ వార్డ్ నడిచింది. దీంతో బాలీవుడ్ అంతా రెండు ముక్కలయ్యింది. కానీ బాబా సిద్ధికీ ఇఫ్తార్ పార్టీ తర్వాత అంతా మారిపోయింది. అప్పటివరకు తమ మధ్య ఉన్న గొడవలను అక్కడే మర్చిపోవాలని సల్మాన్, షారుఖ్ డిసైడ్ అయ్యారు. అందుకే అందరి ముందు హగ్ చేసుకొని గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక బాబా సిద్ధికీపై జరిగిన కాల్పుల విషయానికొస్తే.. పోలీసులు కాల్పులు జరిపిన ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ కేసుపై చాలా సీరియస్‌గా ఉంది.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్9లోకి ఓజీ నటుడు.. వర్కౌట్ అయితే ఇరకాటంలో నాగ్!

Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Promo : సంవత్సరానికి నలుగురు పిల్లలు కావాలా? ఏంటి శ్రీముఖి ఇది? 

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Big Stories

×