E-Paper
Advertisement

Aliabhatt : ఆ వింత సమస్యతో ఇబ్బంది పడుతున్న అలియాభట్..?

Aliabhatt : ఆ వింత సమస్యతో ఇబ్బంది పడుతున్న అలియాభట్..?
Advertisement

Aliabhatt : బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు వాళ్లకు కూడా ఈమె సుపరిచితమే.. రామ్ చరణ్ కు జోడిగా త్రిపుల్ ఆర్ సినిమాలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. ఇక తెలుగులో బిజీ అయిపోతుందని అందరు అనుకున్నారు. కానీ అలియాభట్ బాలీవుడ్ లోనే బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. ఇక ఈ అమ్మడు లైఫ్ స్టైల్ గురించి మొన్నీమధ్య ఓ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. రిచ్ గా ఉండటం మాత్రమే కాదు. ట్రెండింగ్ లో ఉండాలనే ఆలోచనతో అలియాభట్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆమె ఓ వింత సమస్యతో భాద పడుతుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా అలియాభట్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పి షాక్ ఇచ్చింది.

ఈ బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ తాజాగా కరిష్మా కపూర్‌తో పాడ్ కాస్ట్ లో ఆలియా భట్ స్వయంగా తెలిపింది. తనకు ఓ వింత సమస్య ఉందని, హైపర్ టెన్షన్ తో చాలా ఇబ్బంది పడుతుంటానని ఆలియా చెప్పింది. ఓసారి తమ కుమార్తెతో కలిసి రణబీర్ ఒక ఫోటో దిగుదామని ఆలియాను కోరాడు. బయట లంచ్ చేసిన తర్వాత ఫోటో దిగుదామని చెప్పాడట. కానీ అలియాభట్ టెన్షన్ పడిందట. లైఫ్ లో ఎప్పుడూ అలా కంగారు పడలేదని చెప్పింది. ఇక అంతేకాదు తమ కుమార్తెకు రాహా అని పేరు పెట్టాక మీడియాకు పరిచయం చేయాలని భావించారు. కానీ చేయలేదు.. దానికి కూడా ఆలియా చాలా టెన్షన్ కి గురైందట.. అందుకే అప్పటిలో పరిచయం చెయ్యలేదని వార్తలు గుప్పుమంటున్నాయి..

Advertisement

మనిషికి అంత కంగారు పనికిరాదు.. ఊరికే కోపం రావడం వింత సమస్యే అని అలియాభట్ చెప్పింది. ఇక రణబీర్ తనను అర్థం చేసుకున్నాడు. తనకు ఉన్న అనారోగ్యం గురించి ముందే తెలుసు గనుక ఆ సమయంలో టాపిక్ మార్చేసి ఏవేవో మాట్లాడాడు అట. ఈ విషయాలన్నీ తాజా పాడ్ కాస్ట్ లో ఆలియా భట్ వెల్లడించింది.. మానసిక రుగ్మతతో బాధపడుతున్నానని, ఎక్కువ సమయం దేనిపైనా దృష్టి పెట్టలేనని చెప్పింది. తనకు చాలా కాలం పాటు టాస్క్‌లపై దృష్టి పెట్టడం కష్టంగా మారే పరిస్థితి ఉందని వెల్లడించింది.. ఈ వార్త వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్.ఆర్.ఆర్ , రాజీ, గంగూభాయి కతియావాడీ లాంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతో చెరగని ముద్ర వేసుకుంది. ఇక రీసెంట్ గా ఇటీవల జిగ్రా విడుదలైంది. దీనికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. దీంతో పాటు వై.ఆర్.ఎఫ్‌లో స్పై థ్రిల్లర్ ఆల్ఫా చిత్రీకరణలో ఉంది. తదుపరి భన్సాలీ దర్శకత్వంలో `లవ్ అండ్ వార్`లో నటిస్తుంది. ఆ తర్వాత ఒక నిజమైన రొమాంటిక్ లవ్ స్టోరీని నిర్మించడానికి రెడీగా ఉంది. అలాగే మరో సినిమాలో రణబీర్ కపూర్ తో నటించనుందని సమాచారం.. ఈ మూవీ గురించి త్వరలోనే అప్డేట్ రానుంది..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×