Samsung Galaxy F36 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శామ్‌సంగ్ పేరు ప్రత్యేకంగా నిలిచింది. నమ్మకం, క్వాలిటీ, లాంగ్‌టర్మ్ సపోర్ట్‌తో ఇండియన్ యూజర్లకు దగ్గరగా ఉన్న బ్రాండ్ ఇది. అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ 2025 (Samsung Galaxy F36 5G)ను తీసుకొచ్చింది. ప్రీమియం లుక్, డైలీ యూజ్‌కు సరిపోయే పర్‌ఫార్మెన్స్, స్మూత్ డిస్‌ప్లే, స్టేబుల్ సాఫ్ట్‌వేర్ ఇవన్నీ కలిపి ఈ ఫోన్‌ను మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఆప్షన్‌గా నిలబెడుతున్నాయి. ఈ ఫోన్ ఎవరి కోసం, ఇందులో నిజంగా కొత్తదనం ఏముంది, డబ్బుకు విలువ ఇస్తుందా అనే విషయాలు ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం.
డిజైన్ – ప్రీమియం లుక్‌తో స్లిమ్ ఫీలింగ్
ముందుగా డిజైన్ విషయానికి వస్తే, గ్యాలక్సీ ఎఫ్ 36 5జీ మొదటి చూపులోనే ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. స్లిమ్ బాడీతో మ్యాట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ ఉండడం వల్ల చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ బాగుంటుంది. ఫింగర్ ప్రింట్స్ ఎక్కువగా పడకుండా చూసిన డిజైన్ ఇది. కెమెరా మాడ్యూల్ కూడా ఎక్కువగా బయటకు కనిపించకుండా సింపుల్‌గా ఉంటుంది. రోజూ బయటకు తీసుకెళ్లే ఫోన్‌గా చూస్తే, లుక్ పరంగా ఇది చాలా బ్యాలెన్స్‌గా కనిపిస్తుంది.చేతిలో భారంగా అనిపించదు, అదే సమయంలో లో-క్వాలిటీ అనుభూతి కూడా ఇవ్వదు.
డిస్‌ప్లే – లార్జ్ స్క్రీన్‌తో స్మూత్ ఎక్స్‌పీరియెన్స్
ఇప్పుడు డిస్‌ప్లే గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్‌లో లార్జ్ స్మూత్ స్క్రీన్ ఇవ్వడం శామ్‌సంగ్ స్ట్రాంగ్ పాయింట్. హై రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సోషల్ మీడియా యాప్‌లు స్క్రోల్ చేయడం, వీడియోలు చూడడం, డైలీ బ్రౌజింగ్ ఇవన్నీ చాలా కంఫర్ట్‌గా అనిపిస్తాయి. శామ్‌సంగ్ డిస్‌ప్లే క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలర్స్ నేచురల్‌గా కనిపిస్తాయి, బ్రైట్‌నెస్ కూడా అవుట్‌డోర్‌లో సరిపడా ఉంటుంది. ఎక్కువగా వీడియోలు చూసే వాళ్లకు, యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువగా వాడే వాళ్లకు ఈ డిస్‌ప్లే మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
పర్‌ఫార్మెన్స్ – డైలీ యూజ్‌కు స్టేబుల్‌గా
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే, గెలాక్సీ ఎఫ్ 36 5జీ స్టేబుల్ డైలీ యూజ్ కోసం డిజైన్ చేసిన ఫోన్. 5జీ సపోర్ట్‌తో వస్తుండటం వల్ల నెక్స్ట్ కొన్ని సంవత్సరాలు నెట్‌వర్క్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. డైలీ యాప్‌లు, సోషల్ మీడియా, కాల్స్, వీడియో స్ట్రీమింగ్, లైట్ గేమింగ్ ఇవన్నీ స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమింగ్ ఫోన్‌లా కాకపోయినా, నార్మల్ యూజర్లకు కావాల్సినంత పర్‌ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ల్యాగ్ ఫీలింగ్ తక్కువగా ఉంటుంది, మల్టీటాస్కింగ్ కూడా బాగానే మేనేజ్ అవుతుంది.
కెమెరా – ఏఐ సపోర్ట్‌తో రిలయబుల్ ఫోటోలు
కెమెరా సెక్షన్‌కి వస్తే, శామ్‌సంగ్ ఎప్పటినుంచో కెమెరా ట్యూనింగ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ గెలాక్సీ్ ఎఫ్36 5జీలో కూడా రిలయబుల్ కెమెరాలు ఉన్నాయి. ఏఐ సపోర్ట్ ఉండటం వల్ల ఫోటోలు ఆటోమేటిక్‌గా బెటర్‌గా ప్రాసెస్ అవుతాయి. డే లైట్‌లో తీసిన ఫోటోలు క్లియర్‌గా ఉంటాయి, కలర్స్ ఓవర్‌గా కాకుండా నేచురల్‌గా కనిపిస్తాయి. సోషల్ మీడియాకు అప్‌లోడ్ చేసే ఫోటోలు, డైలీ మోమెంట్స్ క్యాప్చర్ చేయడానికి ఈ కెమెరా సెటప్ సరిపోతుంది. వీడియో కాల్స్, రీల్స్, సెల్ఫీలు తీసుకునే వాళ్లకు కూడా ఇది డీసెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.
బ్యాటరీ – ఫుల్ డే బ్యాకప్ ప్లస్ ఫాస్ట్ చార్జింగ్
బ్యాటరీ విషయానికి వస్తే, ఫుల్ డే బ్యాకప్ అనేది ఈ ఫోన్‌లో ఒక పెద్ద ప్లస్ పాయింట్. నార్మల్ యూజ్‌లో ఒక రోజు మొత్తం ఈజీగా నడుస్తుంది. సోషల్ మీడియా, కాల్స్, వీడియోలు ఇవన్నీ కలిపి వాడినా బ్యాటరీ టెన్షన్ ఎక్కువగా ఉండదు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ టైమ్‌లోనే బ్యాటరీని తిరిగి నింపుకోవచ్చు. ఉదయం తొందరగా బయటికి వెళ్లే వాళ్లకు, ఆఫీస్ యూజర్లకు ఇది చాలా ఉపయోగపడే ఫీచర్.
సాఫ్ట్‌వేర్ – క్లిన్ వన్ యూఐ ఎక్స్‌పీరియెన్స్
సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, శామ్‌సంగ్ వన్ యూఐ ఎక్స్‌పీరియెన్స్ చాలా క్లిన్‌గా ఉంటుంది. అనవసరమైన యాప్‌లు తక్కువగా ఉంటాయి, యూజర్ ఇంటర్‌ఫేస్ అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. రెగ్యులర్ అప్‌డేట్స్ రావడం వల్ల సెక్యూరిటీ పరంగా కూడా నమ్మకం ఉంటుంది. లాంగ్‌టర్మ్‌గా ఫోన్ వాడే వాళ్లకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సాఫ్ట్‌వేర్ స్టేబిలిటీ వల్లే చాలా మంది శామ్‌సంగ్ ఫోన్‌లను ఎంచుకుంటారు.
ఇండియాలో ధర , లాంచింగ్ వివరాలు
శామ్‌సంగ్ గెాలాక్సీ ఎఫ్ 36 ఫైవ్ జీ 2025ను ఇండియాలో అధికారంగా 29 జూలై 2025న లాంచ్ చేశారు. ఇది మూడు ప్రధాన వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ప్రారంభ ధరల్లో తేడా ఉంటుంది. బేస్ మోడల్ అంటే శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్36 5జీ (బ్లాక్, 128జిబి) 6జిబి ర్యామ్ పసల్ 128జిబి స్టోరేజ్ కోసం సుమారు రూ.14,999 వరకు ప్రారంభమయ్యింది, అదే సమయంలో 8జిబి ర్యామ్ ప్లస్ 128జిబి లేదా 8జిబి ర్యామ్ ప్లస్ 256జిబి స్టోరేజ్ వంటి ఆప్షన్‌లు కూడా ఉన్నాయి, వీటి ధర సుమారు రూ.17,499 నుండి రూ.18,999 వరకు ఉంటుంది. ఇండ్రన్ ఆఫర్లతో మరియు బ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి డిస్కౌంట్‌లతో ధరలు ఇంకా తక్కువగా పొందవచ్చు. ఈ ధరల రేంజ్ కారణంగా, ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఫీచర్లల్‌తో ఉన్న విలువైన ఎంపికగా నిలుస్తోంది