Galaxy F70e vs Realme P3 Lite vs Vivo Y29 Smartphone Comparison| శాంసంగ్ భారత్‌లో ఇటీవలే గెలాక్సీ F70e పేరుతో ఒక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇదే రేంజ్‌లో రియల్‌మి P3 లైట్, వివో Y29 5G ఫోన్స్‌తో పోటీ పడుతోంది. మూడు ఫోన్లు బడ్జెట్ కొనుగోలుదారులకు, విద్యార్థులకు, రోజువారీ ఉపయోగానికి అనువుగా ఉన్నాయి. మూడు ఫోన్లు కూడా 5G సపోర్ట్‌తో ఆధునిక ఫీచర్లు కలిగి ఉన్నాయి. వీటి ముఖ్య ఫీచర్లను పోల్చి చూద్దాం.
గెలాక్సీ F70e 5G ధర రూ.12,499 నుంచి మొదలవుతుంది. 6GB ర్యామ్ వేరియంట్ రూ.14,999కి దొరుకుతుంది.
రియల్‌మి P3 లైట్ 5G చాలా చౌకగా రూ.11,999 నుంచి అందుబాటులో ఉంది. 6GB వేరియంట్ రూ.12,999 మాత్రమే.
వివో Y29 5G రూ.13,999 నుంచి మొదలై, 6GB వేరియంట్ రూ.15,499కి ఉంది.
మూడు ఫోన్లలో Realme తక్కువ ధరలో ఉంది. శాంసంగ్ బ్యాలెన్స్‌డ్ ధరతో వస్తుంది. వివో కొంచెం ఎక్కువ ధర కలిగి ఉంది.
గెలాక్సీ F70e 5Gలో 6.7 ఇంచ్ LCD డిస్‌ప్లే ఉంది. HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. గరిష్ట బ్రైట్‌నెస్ 800 నిట్స్ వరకు ఉంది.
రియల్‌మి P3 లైట్ లో 6.67 ఇంచ్ డిస్‌ప్లే, HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. బ్రైట్‌నెస్ 625 నిట్స్ మాత్రమే.
వివో Y29లో 6.68 ఇంచ్ LCD డిస్‌ప్లే, HD+తో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. బ్రైట్‌నెస్ విషయంలో శాంసంగ్ బెటర్.
గెలాక్సీ F70e 5Gలో 6,000mAh బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
రియల్‌మి P3 లైట్ లో కూడా 6,000mAh బ్యాటరీ ఉంది. కానీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
వివో Y29 5Gలో 5,500mAh బ్యాటరీ, 44W ర్యాపిడ్ ఛార్జింగ్ ఉన్నాయి.
ఛార్జింగ్ స్పీడ్‌లో రియల్‌మి ముందుంది. బ్యాటరీ సైజు పరంగా శాంసంగ్ బెస్ట్.
గెలాక్సీ F70e 5G Android 16తో One UI 8 ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది.
రియల్‌మి P3 లైట్ 5G Android 15తో Realme UI 6.0 ఉంది.
వివో Y29 5G Android 14తో Funtouch OS ఉంది.
తాజా సాఫ్ట్‌వేర్, ఎక్కువ అప్‌డేట్స్ శాంసంగ్‌కే ఉన్నాయి.
మూడు ఫోన్లలో ఒకే ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఉంది. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్ సాఫీగా జరుగుతాయి. గేమింగ్ సాధారణ స్థాయిలోనే ఉంటుంది. పర్‌ఫామెన్స్‌లో అన్నీ సమానంగానే ఉన్నాయి.
గెలాక్సీ F70e 5Gలో 50MP మెయిన్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
రియల్‌మి P3 లైట్ 5Gలో 32MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
వివో Y29 5Gలో 50MP మెయిన్ + అదనపు సెన్సార్, 8MP సెల్ఫీ ఉన్నాయి. ఫోటో క్వాలిటీలో శాంసంగ్, వివో బెటర్ ఆప్షన్స్.
మూడు ఫోన్లలో డ్యూయల్ సిమ్, 5G, Wi-Fi, బ్లూటూత్ సపోర్ట్ ఉన్నాయి.
గెలాక్సీ F70e 5Gలో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉంది.
రియల్‌మి P3 లైట్ కూడా 5G సపోర్ట్ చేస్తుంది. ఇందులో కూడా వై ఫై, బ్లూ టూత్, USB టైప్‌సి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
Vivo Y29లో బ్లూటూత్ 5.4, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.
కనెక్టివిటీ విషయంలో మూడూ బాగున్నాయి.
Also Read: ఇంటర్నెట్‌లో ఫ్రీగా సినిమాలు చూసేవారిపై కేసులు.. హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
ఛార్జింగ్ స్పీడ్ కావాలంటే Realme P3 Lite బెస్ట్. తాజా సాఫ్ట్‌వేర్, దీర్ఘకాలిక ఉపయోగం కోసం గెలాక్సీ F70e 5G బెటర్. కెమెరా, బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు కావాలంటే వివో Y29 5G బాగుంటుంది. బడ్జెట్‌లో బెస్ట్ ఛాయిస్ ఎంచుకోవడం మీ బడ్జెట్, అవసరాలపై ఆధారపడి ఉంటుంది.