E-Paper
Advertisement

Smartphone Comparison: గెలాక్సీ M17 vs రియల్‌మీ నార్జో 90x vs లావా ప్లే మ్యాక్స్.. రూ.15,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: గెలాక్సీ M17 vs రియల్‌మీ నార్జో 90x vs లావా ప్లే మ్యాక్స్.. రూ.15,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

Galaxy M17 vs Realme Narzo 90x 5G vs Lava Play Max| భారత మార్కెట్‌లో రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నార్జో 90x 5Gను లాంచ్ చేసింది. ఇది లావా ప్లే మ్యాక్స్, శామ్‌సంగ్ గెలాక్సీ M17 5Gతో డైరెక్ట్ గా పోటీ పడుతోంది. మూడు ఫోన్‌లు రూ.15,000లోపు బలమైన ఫీచర్లు కోరుకునే బయర్లను టార్గెట్ చేస్తున్నాయి. మూడింటిలో 5G కనెక్టివిటీ, ఆధునిక ప్రాసెసర్లు, పెద్ద డిస్‌ప్లేలు ఉన్నాయి. ధర, డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ, కెమెరా, సాఫ్ట్‌వేర్‌ను పోల్చి చూద్దాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్‌లు ఏమిటి?

రియల్‌మీ నార్జో 90x 5G రెండు వేరియంట్లలో వచ్చింది. 6GB RAM + 128GB స్టోరేజ్ రూ.13,999. 8GB RAM + 128GB స్టోరేజ్ రూ.15,499. లావా ప్లే మ్యాక్స్ కూడా రెండు ఆప్షన్‌లు. 6GB + 128GB రూ.12,999. 8GB + 128GB రూ.14,999. శామ్‌సంగ్ గెలాక్సీ M17 5G ధరలు కొంచెం తక్కువ. 4GB + 128GB రూ.12,499. 6GB + 128GB రూ.13,999. అయితే ర్యామ్ విషయంలో శాంసంగ్ కంటే మిగతా రెండూ బెటర్ ఆప్షన్స్.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

రియల్‌మీ నార్జో 90x 5Gలో 6.80 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. 720 x 1570 రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్. పీక్ బ్రైట్‌నెస్ 1,200 నిట్స్ ఇస్తుంది. లావా ప్లే మ్యాక్స్‌లో 6.72 అంగుళాల ఫుల్ HD+ LCD స్క్రీన్ ఉంది. 1080 x 2400 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M17 5Gలో 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్. శాంసంగ్ AMOLEDతో మంచి కలర్లు, కాంట్రాస్ట్ ఇస్తుంది.

బ్యాటరీ లైఫ్, చార్జింగ్

రియల్‌మీ నార్జో 90x 5Gలో పెద్ద 7,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. 60W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. లావా ప్లే మ్యాక్స్‌లో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ దేశీ ఫోన్ 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ M17 5Gలో కూడా 5,000mAh బ్యాటరీ ఉంది. కానీ 25W ఫాస్ట్ చార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మూడు ఫోన్లు పోల్చి చూస్తే శాంసంగ్ లో ఛార్జింగ్ స్పీడ్ కాస్త తక్కువ. రియల్ మీ.. పెద్ద బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ లో కూడా ముందంజలో ఉంది.

సాఫ్ట్‌వేర్, యూజర్ ఇంటర్‌ఫేస్

Advertisement

రియల్‌మీ నార్జో 90x 5G ఆండ్రాయిడ్ 15తో రియల్‌మీ UI 6.0. కస్టమైజేషన్, పనితీరు మెరుగ్గా ఉంటుంది. లావా ప్లే మ్యాక్స్ క్లీన్ ఆండ్రాయిడ్ 15. హెవీ స్కిన్ లేకుండా స్టాక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.  శామ్‌సంగ్ గెలాక్సీ M17 5G ఆండ్రాయిడ్ 15తో వన్ UI 7. శామ్‌సంగ్ లాంగ్-టర్మ్ అప్‌డేట్స్, రిఫైన్డ్ ఫీచర్లు ఇస్తుంది.

ప్రాసెసర్, పనితీరు

రియల్‌మీ నార్జో 90x 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. 6nm ప్రాసెస్ పవర్ ఎఫిషియెన్సీ ఇస్తుంది. లావా ప్లే మ్యాక్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300. గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో మంచి పనితీరు కనబరుస్తుంది . శామ్‌సంగ్ గెలాక్సీ M17 5Gలో ఎక్సినోస్ 1330. డైలీ టాస్క్‌లు బాగా చేస్తుంది కానీ హెవీ గేమింగ్‌లో కొంచెం వెనుకబడుతుంది. చిప్ పరంగా చూసుకుంటే లావా టాప్.

కెమెరా సెటప్

రియల్‌మీ నార్జో 90x 5Gలో 50MP రెర్ కెమెరా f/1.8 అపర్చర్. 8MP ఫ్రంట్ కెమెరా. లావా ప్లే మ్యాక్స్‌లో 50MP రెర్ కెమెరా EIS సపోర్ట్. 8MP ఫ్రంట్ కెమెరా. శామ్‌సంగ్ గెలాక్సీ M17 5Gలో ట్రిపుల్ రెర్ కెమెరా. 50MP మెయిన్ OIS సపోర్ట్. 5MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో. 13MP ఫ్రంట్ కెమెరా షార్ప్ సెల్ఫీలు. మొత్తంగా చూస్తే.. శాంసంగ్ కెమెరాలు బెస్ట్.

Also Read: ఐఫోన్ ఐక్లౌడ్ స్టోరేజ్‌ ఫుల్ అయిందా? డేటా కోల్పోకుండా ఫ్రీ చేయాలంటే ఇలా చేయండి

కనెక్టివిటీ ఫీచర్లు

రియల్‌మీ నార్జో 90x 5Gలో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3. GPS, USB టైప్-C. లావా ప్లే మ్యాక్స్‌లో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2. డ్యూయల్ 4G VoLTE, USB టైప్-C. శామ్‌సంగ్ గెలాక్సీ M17 5Gలో 5G, Wi-Fi, బ్లూటూత్, NFC, USB పోర్ట్.

ఏ ఫోన్ కొనాలి?

రూ.15,000లోపు శామ్‌సంగ్ గెలాక్సీ M17 5G చాలా మందికి బెస్ట్ చాయిస్. సూపర్ AMOLED డిస్‌ప్లేతో మంచి కలర్లు, కాంట్రాస్ట్. వర్సటైల్ కెమెరా సెటప్ OIS సపోర్ట్, ఎక్స్ట్రా లెన్స్‌లు. వన్ UI 7తో ఆండ్రాయిడ్ 15 పాలిష్డ్ సాఫ్ట్‌వేర్, మంచి అప్‌డేట్స్. బ్యాలెన్స్‌డ్ పనితీరు, డైలీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ చార్జింగ్ ప్రయారిటీ అయితే రియల్‌మీ నార్జో 90x 5G బెస్ట్.. 7000mAh బ్యాటరీ, 60W చార్జింగ్. ఇందులో బాగున్నాయి.

గేమింగ్, యాప్స్‌కు స్ట్రాంగ్ పర్‌ఫామెన్్ కావాలంటే లావా ప్లే మ్యాక్స్. ఇందులోని అడ్వాన్స్  డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, మంచి స్పెక్స్ ఉన్నాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×