E-Paper
Advertisement

Ganja Youth Attack: బెజవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వీళ్ళు చేసింది చూస్తే..

Ganja Youth Attack: బెజవాడలో గంజాయి బ్యాచ్ వీరంగం.. వీళ్ళు చేసింది చూస్తే..
Advertisement

Ganja Youth Attack: విజయవాడలో గంజాయి ముఠాల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా అజిత్ సింగ్ నగర్ నియోజకవర్గ పరిధిలో గంజాయి బ్యాచ్ సృష్టించిన బీభత్సం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

అజిత్ సింగ్ నగర్‌లోని ఒక నివాసంలోకి గంజాయి మత్తులో ఉన్న దుండగులు ఒక్కసారిగా చొరబడ్డారు. ఇంట్లో ఉన్న మహిళా యజమానిని భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, ఆమె కుమారుడిపై అత్యంత క్రూరంగా దాడికి తెగబడ్డారు. నిందితులు ముందుగా బాధితుడి కళ్లలో కారం చల్లి, ఆపై క్రికెట్ బ్యాట్లు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. “మిమ్మల్ని చంపేస్తాం” అంటూ కేకలు వేస్తూ ఇంటి కిటికీ అద్దాలు, తలుపులను ధ్వంసం చేసి అక్కడ భీభత్స వాతావరణాన్ని సృష్టించారు.

Advertisement

బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడికి పాల్పడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. నగరంలో గంజాయి విక్రయాలు, వాడకం పెరిగిపోవడం వల్లే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

 

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×