Samsung Discount| శాంసంగ్ గెలాక్సీ M సిరీస్‌లో పాపులర్ ఫోన్ గెలాక్సీ M56 5Gపై (Samsung Galaxy M56 5G) ఇప్పుడు మంచి ఆఫర్ వచ్చింది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.27,999గా ఉంది. ఇప్పుడు అమెజాన్ ఇండియాలో అదే మోడల్ రూ.21,999కి లభిస్తోంది. అంటే నేరుగా రూ.6,000 తగ్గింపు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంది. కాబట్టి త్వరగా కొనాలి.
డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులతో చెల్లింపు చేస్తే రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ మార్చి 12 వరకు చెల్లుబాటు అవుతుంది. పేమెంట్ ఆప్షన్ల ఆధారంగా రూ.1,099 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే మరింత తక్కువ ధరకు వస్తుంది. ఎక్స్‌చేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది.
ఈ ఫోన్‌లో 6.7 ఇంచ్ Full HD+ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1080*2340 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, గేమింగ్ స్మూత్‌గా ఉంటాయి. పీక్ బ్రైట్‌నెస్ 1200 నిట్స్ వరకు ఉంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉంది. ఫోన్ సన్నగా 7.2mm మందం, 180 గ్రాముల బరువు మాత్రమే. లైట్ గ్రీన్, బ్లాక్ కలర్లలో లభిస్తుంది.
ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ఉంది. డైలీ టాస్క్‌లు, మోడరేట్ గేమింగ్ సులభంగా రన్ అవుతాయి. 8GB LPDDR5x ర్యామ్‌తో మల్టీటాస్కింగ్ స్మూత్. 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజ్ ఉంది. యాప్‌లు త్వరగా ఓపెన్ అవుతాయి. లాగ్ లేకుండా ఉంటుంది.
ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో లెన్స్. సెల్ఫీలకు 12MP ఫ్రంట్ కెమెరా. లైటింగ్ వేర్వేరుగా కండిషన్లలో మంచి ఫోటోలు తీసుకోవచ్చు.
Also Read: మీ యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ పెరగడం లేదా? ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించండి
5000mAh బ్యాటరీ ఉంది. ఎక్కువ సమయం ఉపయోగించవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7 ఉంది. సామ్‌సంగ్ 6 సంవత్సరాల OS అప్‌డేట్స్ ఇస్తుంది. 5G, Wi-Fi, Bluetooth 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
శాంసంగ్ బ్రాండ్‌లో ఈ డిస్కౌంట్‌తో గెలాక్సీ M56 5G బడ్జెట్‌లో బెస్ట్ ఆప్షన్‌గా మారింది. మంచి డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉన్నాయి. క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు దొరుకుతుంది.