Samsung Smart Phone Price Hike: శాంసంగ్ ఇండియా గెలాక్సీ A, F సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల రేట్లను మరోసారి పెంచనున్నట్లు సమాచారం. ఈ ధరల పెంపు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గెలాక్సీ A06, గెలాక్సీ A56, గెలాక్సీ F17తో సహా పలు బడ్జెట్, మిడ్-రేంజ్ మోడళ్ల ధరలు పెరగనున్నాయి. అయితే ధరల పెంపుపై శాంసంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ సవరించిన ధరలు పలు గెలాక్సీ మోడళ్లకు వర్తిస్తాయని సమాచారం.
శాంసంగ్ భారత్ లో గెలాక్సీ A06, A07,A17, A36, A56, గెలాక్సీ F17తో సహా పలు ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ మోడళ్ల ధరలను పెంచాలని భావిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A06 ధర రూ. 1,000 పెరిగి, రూ. 13,499కి చేరుకోవచ్చు. అలాగే గెలాక్సీ A07 ధర రూ. 1,250 మేర పెరిగి ధర రూ. 10,999కి చేరవచ్చు. మిడ్ రేంజ్ ఫోన్ల విభాగంలో, గెలాక్సీ A17 ధర రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ. 27,999 వరకు చేరవచ్చని సమాచారం. ముఖ్యంగా, ఈ హ్యాండ్‌సెట్ 6GB RAM, 128GB స్టోరేజ్‌తో రూ. 18,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
Also Read: రూ.8,000 లోపే అదిరిపోయే స్మార్ట్ టీవీలు.. ఈ ఆఫర్‌ను మిస్ చేసుకుంటే తర్వాత మీరే బాధపడతారు!
శాంసంగ్ గెలాక్సీ A36 ధర రూ. 1,500 నుంచి రూ. 3,000 వరకు పెరిగే అవకాశం ఉంది.కాన్ఫిగరేషన్‌ను బట్టి దీని ధరలు రూ. 43,499 వరకు పెరగనున్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 8GB + 128 GB కాన్ఫిగరేషన్ ఫోన్ స్టార్టింగ్ ధర రూ. 32,999గా ఉంది. 8GB + 256GB , 12GB + 256GB కాన్ఫిగరేషన్‌ల ధరలు వరుసగా రూ. 35,999, రూ. 38,999గా ఉన్నాయి. మిడ్ రేంజ్ ఫోన్లు గెలాక్సీ A56, రూ. 2,000 నుండి రూ. 3,500 వరకు ధర పెరిగే అవకాశం ఉంది. హై రేంజ్ వేరియంట్ల ధర రూ. 52,499 వరకు పెరగవచ్చు. గెలాక్సీ F17 ధర పెంపు కూడా ఖాయంగా కనిపిస్తోంది . అన్ని వేరియంట్లపైనా మినిమమ్ రూ. 1,000 పెంపు ఉండవచ్చని సమాచారం. అయితే కాన్ఫిగరేషన్లపై కచ్చితమైన పెంపును శాంసంగ్ ఇంకా ప్రకటించలేదు.