BigTV English
Advertisement

Samsung Galaxy S23 : ఒక్క మెుబైల్ పై ఏకంగా రూ.53వేల డిస్కౌంటా! ఆఫర్ అరాచకం బాస్

Samsung Galaxy S23 : ఒక్క మెుబైల్ పై ఏకంగా రూ.53వేల డిస్కౌంటా! ఆఫర్ అరాచకం బాస్

Samsung Galaxy S25 : యమా సేల్​ గురూ! శాంసంగ్​ సూపర్​ స్మార్ట్ ఫోన్ పై ఎలాంటి బ్యాంక్ కార్డ్​ లేకుండానే రూ.33వేల డిస్కౌంట్​తో కొనేసే ఛాన్స్.. నిజం నమ్మలేకపోతున్నారు కదూ.


మీరు శాంసంగ్​లో అదిరిపోయే కెమెరా, సూపర్ పెర్​ఫార్మెన్స్​, స్టైలిష్ డిజైన్​తో ఉండే టాప్ నోచ్ ఎక్సపీరియన్స్​ అందించగల మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ కళ్లు చెదిరే ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రూ.1,29,999 ధర ఉన్న ఫోన్​ ఇప్పుడు రూ.33 వేల డిస్కౌంట్​తో అందుబాటులోకి వచ్చేసింది.

ఇంతకీ ఆ ఫోన్ ఏంటంటే? శాంసంగ్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్​షిప్​ ఫోన్ గెలాక్సీ S23 అల్ట్రా 5జీ (Samsung Galaxy S23 Ultra). ఈ స్మార్ట్ ఫోన్​ రూ.1,29,999కు మార్కెట్​లోకి లాంఛ్ అయింది. అయితే ఇప్పుడు సగం ధర కన్నా తక్కువకే అందుబాటులోకి వచ్చింది. అమెజాన్​లో రూ.77 వేలకే దొరుకుతోంది. ఈ నేపథ్యంలో దాన్ని స్పెసిఫికేషన్స్ ఏంటి, తక్కువ ధరకే ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.


Samsung Galaxy S23 Ultra 5G డిస్కౌంట్​  – 

అమెజాన్​లో ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 5G ధర ఎటువంటి బ్యాంక్ ఆఫర్స్​ లేకుండానే రూ.76,999గా ఉంది. సాధారణంగా దీని ధర రూ.లక్షకు పైగానే ఉంది. ఇప్పుడు దీన్ని రూ.33 వేల డిస్కౌంట్​తో అందిస్తున్నారు. ఒకవేళ మీరు మీ పాత ఫోన్​ను ఎక్సేంఛ్ చేయాలనుకుంటే దానిపై రూ. 22,800 వరకు పొందొచ్చు. కస్టమర్లకు ఈఎమ్​ఐ ఆప్షన్​ వెసులుబాటును కూడా కల్పించారు. నెలకు రూ.3,770తో ఇది ప్రారంభం అవుతుంది.

అదే ఫ్లిప్​కార్ట్​లో అయితే ఈ గెలాక్సీ S23 అల్ట్రా 5G రూ.89,000కు అందుబాటులో ఉంది. కస్టమర్లకు ఫ్లిప్​కార్ట్ యాక్సిస్​ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్​పై 5 శాతం డిస్కౌంట్​ లభిస్తుంది. కాకపోతే ఎటువంటి బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో లేవు. ఎక్సేంఛ్​ వ్యాల్యూ కూడా దొరుకుతుంది. అంటే ఫ్లిప్​కార్ట్​తో పోలిస్తే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు అమెజాన్ డీల్​ బెటర్​ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ డబ్బును ఆదా చేయొచ్చు.

Samsung Galaxy S23 Ultra 5G specifications –

Samsung గెలాక్సీ S23 అల్ట్రా ఆండ్రాయిడ్‌ 15తో పనిచేసే వన్‌యూఐ 7తో వచ్చింది. 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ డైనమిక్‌ అమోలెడ్‌ 2 ఎక్స్‌ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేట్‌ కూడా ఉంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా విక్టస్​ 2 ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ వినియోగించారు. ఆడ్రినో 740జీపీయు కూడా ఉంది.
200MP ప్రధాన కెమెరా అన్నింటి కంటే హైలైట్‌. దీంతో పాటు 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ సెన్సార్, 10 ఎంపీ 10x పెరిస్కోప్​ టెలీఫోటో లెన్స్‌ను వినియోగించారు. ముందు వైపు 12 ఎంపీ సెన్సర్‌ను వాడారు. ఐపీ68 రేటింగ్‌ కలిగిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ ఉంది. ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 45W ఫాస్ట్​ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇక సామ్ సాంగ్ లాంఛ్ చేసిన హై ఎండ్ మెుబైల్స్ లో ఇది కూడా ఒకటి. మరి ఇంకెందుకు ఆలస్యం.. కొనాలనుకుంటే ట్రై చేసేయండి.

ALSO READ :  జనవరి 7న వచ్చేస్తున్న “వన్ ప్లస్ 13”! ఫీచర్స్ వేరే లెవెల్ బాస్

Related News

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేయండి

Moto G Stylus 5G: స్టైలస్‌తో స్టైలిష్‌గా.. మోటరోలా మోటో జి స్టైలస్ 5జి స్పెషల్‌ ఫీచర్లు ఇవే

Nokia X 5G: మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన నోకియా ఎక్స్ 5జి.. 6000mAh బ్యాటరీతో ఎంట్రీ..

Redmi K80 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న రెడ్మీ కె80 ప్రో అల్ట్రా 5జి.. ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌ ఫోన్‌!

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Big Stories

×