Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరోగా నాని మారిన విధానం ఎంతోమందికి ఆదర్శప్రాయం. అష్టా చమ్మా అనే సినిమాతో హీరోగా పరిచయమైన నాని… మంచి కథలను ఎంచుకుంటూ, తన న్యాచురల్ పెర్ఫార్మెన్స్ తో న్యాచురల్ స్టార్ గా మారాడు. గత రెండేళ్లుగా నాని వరుస హిట్లు ఇస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తూ వస్తున్నాడు. దసరా, హయ్ నాన్న, సరిపోదా శనివారం.. ఇలా హిట్స్ పరంపరను కొనసాగిస్తూ వస్తున్నాడు.
ఇక ఇప్పుడు కూడా నాని చేతిలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం నాని.. ఓదెల సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇంకోపక్క హిట్ 3 సినిమాతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు.
ఈ ఏడాది ఐటెంసాంగ్స్ లో ఆడిపాడిన హీరోయిన్స్ ఎవరెవరు అంటే.. ?
ఇక సినిమాలు విషయం పక్కన పెడితే నాని వివాదాలలో కూడా ముందే ఉంటాడు. ఎలాంటి విషయం గురించి అయినా నిర్మూహమాటంగా మనసులో ఏది అనిపిస్తే అది చెప్తూ ఉంటాడు. ఇలా మనసులో మాట పైకి చెప్తూనే నాని ఎన్నోసార్లు విమర్శల పాలు అయ్యాడు. తాజాగా ఈ కుర్ర హీరో సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ షోకు గెస్ట్ గా వెళ్ళాడు. సరిపోదా శనివారం స్పెషల్ అనే పేరుతో ఈ ఎపిసోడ్ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక ఈ షోలో సరిపోదా శనివారం జంట నాని, ప్రియాంక మోహన్ సందడి చేశారు. సింగర్స్.. నానికి సర్ ప్రైజ్ ఇచ్చారు. నాని కూడా దసరాలోని సాంగ్ పాడి వినిపించగా.. ప్రియాంక మోహన్ కమ్మని నీ ప్రేమ లేఖలే సాంగ్ పాడి అదరగొట్టేసింది. ఇక సింగర్స్ వాయిస్ కు ఫిదా అయిన నాని మ్యూజిక్ గురించి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Prasad Behara: ఆడాళ్లను వేధించడమే పని.. ఒక్క అమ్మాయిని కూడా వదిలేది లేదు
” ఏఐ వచ్చేస్తుంది మ్యూజిక్ లోకి.. ఫ్యూచర్ ఏంటి సింగర్స్ కి అని డిస్కషన్ జరిగింది. ఈరోజు ఇక్కడ కూర్చుని వాళ్లు పాడుతున్నది చూస్తూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది. ఏఐ ఏమి పీకలేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నాని మాటలపై నెటిజన్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ షో గురించి అందరికీ తెల్సిందే. ఏపాటి నుంచో ఈ సింగింగ్ షో నడుస్తోంది. సీజన్స్ మారుతున్నా.. సింగర్స్ మారుతున్నా అభిమానులకు మాత్రం ఈ షో అంటే మక్కువ పోలేదు. జీ తెలుగు లో ప్రసారం అవుతున్న ఈ షోకు అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి యాంకరింగ్ చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగర్ శైలజ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.