Oneplus 13 : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్… త్వరలోనే అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త మెుబైల్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. వన్ ప్లస్ 13 పేరుతో రాబోతున్న ఈ మెుబైల్ ఇప్పటికే చైనాలో లాంఛ్ అయింది. ఇండియాలో సైతం లాంఛ్ డేట్ కన్ఫామ్ అయింది. జనవరి 7న ఈ మెుబైల్ నాలుగు వేరియంట్లలో భారతీయ మార్కెట్లోకి రాబోతుంది.
వన్ ప్లస్ అదిరిపోయే ఫీచర్స్‌తో మరో కొత్త మోడల్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది. చైనాలో ఈ మోడల్‌ను ఇప్పటికే ఆవిష్కరించారు. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి రాబోతున్న అతికొద్ది ఫోన్స్‌లో ఇది కూడా ఒకటి. అయితే ఈ ఫోన్ ను దాని ముందు మోడల్స్ కంటే ఫీచర్స్ విషయంలో చాలా అప్‌గ్రేడ్ చేయడం విశేషం. 6000mah బ్యాటరీ బ్యాకప్‌తో ఫోన్ అందుబాటులోకి రావడం వన్ ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోన్ కేవలం చైనాలో మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడాని ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ గట్టిగా వినిపించింది. ఈ నేపథ్యంలోనే జనవరి 7న వన్ ప్లస్ 13 ఇండియాలో లాంఛ్ కాబోతుంది.
Oneplus 13 Features And Specifications –
లేటెస్ట్ గా వస్తున్న మెుబైల్స్ లో కర్వ్ డిస్ప్లేకు క్రేజ్ ఉండటంతో ఈ ఫోన్ కూడా కర్వ్ డిస్ప్లే ప్లేతోనే మార్కెట్‌లోకి రాబోతుంది. దీంతో ఫోన్ చూడ్డానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. 6.82 అంగుళాల డిస్ప్లే ఉండగా.. వీడియోలు, సినిమాలు ఎక్కువగా చూసేవారికి చాలా బాగా ఉపయోగపడతుంది. డిస్ప్లే పైనే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూాడా ఉంది.
ఈ ఫోన్‌లో గేమిండ్ కంట్రోలర్ ఫీడ్ బ్యాక్ ఫీచర్ ఉండటం విశేషం. దీంతో ఇది గేమింగ్ ప్రియుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినట్లు తెలుస్తుంది. అదే విధంగా IP69 అనే సరికొత్త ఫీచర్‌ను డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఈ ఫోన్‌లో ఇచ్చారు. చైనీస్ మొబైల్స్‌లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఇక కెమెరా విషయానికి వస్తే… ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతుంది. 50MP కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్ కాగా మెయిన్ కెమెరా సోని ఎల్‌వైటీ 808 సెన్సార్, ఓఐఎస్‌తో రూపొందించారు. ఇది మాక్రో లెన్స్‌గా కూడా పనిచేస్తుంది. అదే విధంగా ఫ్రంట్ కెమెరాను 32MP తో అందుబాటులోకి రాబోతుంది. చైనీస్ మార్కెట్ కోసం ఆండ్రాయిడ్ 15 ఆధారంగా కాలర్ ఓస్ 15తో రూపొందించారు. కానీ అంతర్జాతీయ వెర్షన్ లో ఆక్సీజన్ ఓఎస్ 15తో రాబోతున్నట్టు సమాచారం. 6000mah సిలికాన్ బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది.
Oneplus 13 Price –
ఇప్పటికే ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12GB + 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చేస్తున్న స్టార్టింగ్ వెర్షన్ ధర ఇండియన్ కరెన్సీ ప్రకారంగా రూ.53,100 ఉంది. 12 GB+512 GB మోడల్ ధర రూ.57,900, 16 GB+512 GB మోడల్ ధర రూ.62,600, 24 GB+1TB మోడల్ ధర రూ.70,900గా ఉంది.
ALSO READ : క్యూఆర్ కోడ్ తో నకిలీ డెలివరీ స్కామ్స్ ఎన్నో! ఎలా మాయచేస్తారంటే!