E-Paper
Advertisement

Samsung Galaxy S24 FE: అతి పెద్ద డిస్‌ప్లేతో కొత్త ఫోన్.. గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ అదిరిపోయిందిగా..!

Samsung Galaxy S24 FE: అతి పెద్ద డిస్‌ప్లేతో కొత్త ఫోన్.. గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ అదిరిపోయిందిగా..!
Advertisement

Samsung Galaxy S24 FE Specifications Leaked: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన లైనప్‌లో ఉన్న మరో మొబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. గెలాక్సీ ఎస్ సిరీస్‌లో Samsung Galaxy S24 FE ఫోన్‌ను త్వరలో లాంచ్ చేసేందుకు రెడీ అయింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 24కి అప్‌డేట్ వెర్షన్‌. గెలాక్సీ ఎస్ 24 మొబైల్ ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ మార్కెట్‌లో లాంచ్ అయి మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు దీనికి అప్‌డేటెడ్ వెర్షన్‌గా గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ స్మార్ట్‌‌ఫోన్ రాబోతుంది.

ఈ కొత్త మొబైల్‌ లాంచ్‌కు ముందు దాని స్పెసిఫికేషన్స్ లీక్‌ అయ్యాయి. ఈసారి ఫోన్‌కి సంబంధించిన అధికారిక డిజైన్‌ను వెల్లడించినట్లు సమాచారం. అంతేకాకుండా దీని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. ఫోన్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. 1900 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను ఇందులో అందించినట్లు సమాచారం. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. లీక్ అయిన అన్ని స్పెసిఫికేషన్ల విషయానికొస్తే..

Advertisement

Samsung Galaxy S24 FE త్వరలో లాంచ్ అవుతుంది. లాంచ్‌కు ముందే ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ ఫోన్ అధికారిక డిజైన్‌ను వెల్లడించినట్లు పేర్కొంది. ఈ ఫోన్ Samsung Galaxy S24 సిరీస్ మోడళ్లను పోలి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈసారి ఫోన్ గత మోడళ్ల కంటే పెద్ద డిస్‌ప్లేతో ఉంటుందని వెల్లడించింది.

Also Read: కిర్రాక్ డిస్కౌంట్స్.. ఐఫోన్‌, శాంసంగ్, పిక్సెల్, మోటో ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!

Advertisement

Galaxy S24 FE 6.7-అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1900 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్ ఇందులో అందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. పెద్ద డిస్‌ప్లేతో ఫోన్ సైజు కూడా పెద్దదిగా ఉండబోతుంది. బ్యాటరీ విషయానికొస్తే.. ఇది మరింత కెపాసిటీతో వస్తుందని తెలుస్తోంది. ఈసారి కంపెనీ కొత్త ఫోన్‌లో 4565mAh బ్యాటరీని అందించగలదని చెబుతున్నారు. పాత మోడల్ 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీకి సంబంధించి.. ఇది 29 గంటల వీడియో ప్లేబ్యాక్, 78 గంటల ఆడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని పేర్కొనబడింది.

Exynos 2400e చిప్‌సెట్‌ని ఫోన్‌లో చూడవచ్చు. ఈ ఫోన్‌లో కంపెనీ సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే AI ఫీచర్లను అందించబోతుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 8-మెగాపిక్సెల్ 3X ఆప్టికల్ జూమ్ లెన్స్ ఫోన్‌లో చూడవచ్చు. ఫోన్ ధర గురించి ఎటువంటి సమాచారం లేదు. త్వరలో ఈ ఫోన్ అధికారిక స్పెసిఫికేషన్లు వెల్లడికానున్నాయి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×