Galaxy S25 FE Price Cut: బడ్జెట్ ధరలో మంచి ప్రీమియం శాంసంగ్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. ప్రీమియం ఫీచర్లతో అలరించే Samsung Galaxy S25 FE మోడల్‌పై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. సరికొత్త Galaxy S26 FE మోడల్ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్న వేళ.. ముందు తరం ఫోన్‌ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకునే మంచి అవకాశం ఇది.
లాంచ్ సమయంలో 128GB వేరియంట్ రూ.59,999గా ఉండేది. కానీ ప్రస్తుతం అమెజాన్‌లో ఇది ఏకంగా రూ.12,000 తగ్గింపుతో రూ.47,999లకే లభిస్తోంది. అంతేకాదు.. బ్యాంక్ ఆఫర్లతో అదనంగా మరికొంత ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ పే, ఐసిఐసిఐ కార్డ్ వాడితే రూ.1,500 వరకు డిస్కౌంట్ దక్కుతుంది. మీ పాత ఫోన్ కండిషన్ బట్టి గరిష్టంగా రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే వెసులుబాటు కూడా ఉంది.
Also Read: చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!
ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రీన్ వాడకం చాలా స్మూత్‌గా ఉంటుంది. 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ వాడారు. IP68 రేటింగ్ ఉండటం వల్ల నీటి చినుకులు, ధూళి నుండి ఫోన్‌కు ఎలాంటి ముప్పు ఉండదు.
ఫోన్ వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా (OIS తో), 3x ఆప్టికల్ జూమ్ ఇచ్చే 8MP టెలిఫోటో కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 12MP కెమెరా అందించారు. ఇక ఈ ఫోన్ పనితీరు విషయానికొస్తే.. దీనిలో ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ ఉంది. 4900mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణ. సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, ఇంటర్‌ప్రిటర్, నోట్ అసిస్ట్, రైటింగ్ అసిస్ట్ వంటి గెలాక్సీ AI టూల్స్ మన రోజువారీ పనులను చాలా సులభం చేస్తాయి. ఫొటోలు, ఆడియోలను ఎడిట్ చేయడానికి ఫొటో అసిస్ట్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఆడియో ఎరేజర్ వంటి అధునాతన ఆప్షన్లు కూడా ఉన్నాయి. సూపర్ ఫీచర్లున్న ఫోన్ రూ.50 వేలలోపు దొరకడం అంటే ఖచ్చితంగా బెస్ట్ ఆప్షనే.
Also Read: భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!