Mivi One 5G: ఇప్పటివరకు మనందరికీ Mivi అనగానే బడ్జెట్ ధరకు లభించే ఇయర్‌ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లే గుర్తుకొస్తాయి. ఆడియో రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భారతీయ బ్రాండ్.. ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్ రంగాన్ని ఏలడానికి సిద్ధమైంది. ఇండియా మొబైల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ.. తమ తొలి స్మార్ట్‌ఫోన్ Mivi One 5Gని సెప్టెంబర్ 24న మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్లకు సంబంధించిన విషయాలు లీక్ అయ్యాయి.
మివి సంస్థ విడుదల చేసిన టీజర్ ప్రకారం ఈ ఫోన్ వెనుక భాగం చాలా ఆకర్షణీయంగా కనిపించనుంది. ముఖ్యంగా వెనకాల రెండు పెద్ద డయాగ్నల్ సర్క్యులర్ లెన్స్‌లతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. దీని పక్కనే సన్నని పిల్‌షేప్ LED ఫ్లాష్‌లైట్ ఉంటుంది. గ్రీన్ కలర్ వేరియంట్‌లో రానున్న ఈ ఫోన్, గుండ్రటి అంచులతో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా డిజైన్ చేశారు.
Also Read: 90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!
పనితీరు విషయంలో ఎక్కడా తగ్గకుండా ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 5G ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఏ మోడల్ చిప్‌సెట్ వాడారనేది ఇంకా అధికారికంగా చెప్పలేదు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను హైదరాబాద్‌లోనే పూర్తిగా అసెంబుల్ చేస్తుండడం విశేషం. గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ఫోన్‌లో చాలా క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
అతి తక్కువ ధరలోనే 5G సేవలను సామాన్యులకు అందించాలనేది మివి ఆలోచన. అందుకే ఈ Mivi One 5G ఫోన్ రూ.15,000 బడ్జెట్‌లోనే లభించే అవకాశం ఉంది. ఈ ధరలో వస్తే ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర బడ్జెట్ 5G ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.
ఆడియో బ్రాండ్ నుండి పూర్తిస్థాయి టెక్ కంపెనీగా మారాలనే మివి ప్రణాళికకు ఈ ఫోన్ తొలి అడుగు. హైదరాబాద్‌లోనే తయారీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, గూగుల్ సహకారం, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ వంటి అంశాలు ఈ ఫోన్‌పై ఆసక్తిని పెంచుతున్నాయి. సెప్టెంబర్ 24 లాంచ్ డేట్ దగ్గరపడుతుండటంతో.. ధర, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Also Read: వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?