Redmi 17 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షావోమీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో గత కొన్ని నెలలుగా వరుస ఫోన్లను లాంచ్ చేస్తున్న రెడ్ మీ.. ఇప్పుడు కొత్తగా Redme 17 5G మోడల్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్ డిజైన్, ఫీచర్లు చూస్తే ఎవరికైనా వెంటనే నచ్చేస్తాయి. ముఖ్యంగా Redme Note 17 5G కంటే దీని ధర తక్కువగా ఉండటం విశేషం. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర ఎంత? ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫోన్ మనదేశంలో రెండు రకాల స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999 కాగా.. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా నిర్ణయించారు. ఇది ఈటర్నల్ ఆరెంజ్, ఎండ్ లెస్ బ్లూ, ఆబ్సల్యూట్ బ్లాక్ అనే 3 ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబర్ 10 నుంచి అమేజాన్, ఎంఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Also Read: చైనా ఫోన్లకు చెక్ పెడుతూ.. హైదరాబాద్‌లోనే తయారైన తొలి Mivi 5G ఫోన్ వచ్చేస్తోంది!
Redme 17 5G ఫోన్ 6.9 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో వస్తోంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల గేమింగ్, వీడియోలు చూడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. స్క్రీన్ భద్రత కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i కోటింగ్ ఇచ్చారు. ఇక ఫోన్ వేగం కోసం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3పై ఇది పనిచేస్తుంది.
ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రైమరీ ఏఐ కెమెరా ఉంది. ఇది మంచి క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా అమర్చారు. ఆడియో ప్రియుల కోసం 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందించడం ప్లస్ పాయింట్. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. ఏకంగా 7900mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు హాయిగా వాడుకోవచ్చు. త్వరలోనే కంపెనీ Reme Note 17 Pro Max 5Gని కూడా లాంచ్ చేయబోతోంది.
Also Read: డెల్ నుంచి సూపర్ AI ల్యాప్‌టాప్‌లు లాంచ్.. 5G, Wi-Fi 7 ఫీచర్లతో కిరాక్ లుక్!