E-Paper
Advertisement

165Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్.. వన్‌ప్లస్ నుంచి పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్ వచ్చేస్తోంది!

165Hz డిస్‌ప్లే, డైమెన్సిటీ 9500 చిప్‌సెట్.. వన్‌ప్లస్ నుంచి పవర్‌ఫుల్ గేమింగ్ ఫోన్ వచ్చేస్తోంది!
Advertisement

OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ అంటనే యువతలో ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. ఈ బ్రాండ్ నుంచి కొత్త ఫోన్లు విడుదలైన ప్రతిసారీ మార్కెట్లో డిమాండ్ ఏర్పడుతుంది. అయితే గతేడాది చైనాలో రిలీజైన ‘ఏస్ 6’ సిరీస్‌కు కొనసాగింపుగా, ఇప్పుడు ‘వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా’ పేరుతో సరికొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. దీనికి సంబంధించి వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ లూయిస్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఏప్రిల్ నెలను వన్‌ప్లస్ ‘ఏస్ ప్రొడక్ట్స్ మంత్‌’గా ప్రకటించడంతో.. ఈ నెలలోనే ఈ కొత్త ఫోన్ లాంచ్ అవ్వడం గ్యారెంటీ అని టెక్ వర్గాలు అంటున్నాయి.

డైమెన్సిటీ 9500 చిప్‌సెట్..

వన్‌ప్లస్ ఏస్ సిరీస్ అంటేనే మెరుపు వేగానికి పెట్టింది పేరు. ఇప్పుడు రాబోతున్న ఈ అల్ట్రా మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ను వాడుతున్నారట. ఇది లేటెస్ట్ 3 నానోమీటర్ టెక్నాలజీతో వస్తోంది. దీనివల్ల ఫోన్ ఎంత వాడినా హ్యాంగ్ అవ్వదు. ముఖ్యంగా హెవీ గేమ్స్ ఆడేవారికి, మల్టీ టాస్కింగ్ చేసేవారికి ఈ ఫోన్ మంచి ఎంపిక కానుంది. పాత మోడల్ ఏస్ 6తో పోలిస్తే దీని పనితీరు చాలా మెరుగ్గా ఉంటుందట.

Advertisement

Also Read: అంత ధర ఉన్న ఫోన్ ఇంత తక్కువకా? ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 10పై కళ్లు చెదిరే ఆఫర్!

స్క్రీన్ క్వాలిటీ అద్భుతం..

ఈ రోజుల్లో ఫోన్ అంటేనే డిస్‌ప్లే. అందుకే వన్‌ప్లస్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లే ఉండబోతోందని టాక్. ఇలాంటి హై రిఫ్రెష్ రేట్ ఉంటే వీడియోలు చూడటంలో కానీ, గేమింగ్‌లో కానీ ఎక్కడా అంతరాయం లేకుండా చాలా స్మూత్‌గా ఉంటుంది. కర్వ్డ్ డిస్‌ప్లే కంటే ఫ్లాట్ స్క్రీన్ ఇష్టపడే వారికి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌లో ఉండబోతోంది.

బ్యాటరీ బ్యాకప్‌లో కొత్త రికార్డు..

Advertisement

చాలామందికి ఫోన్ ఫీచర్లు ఎన్ని ఉన్నా బ్యాటరీ ఎక్కువసేపు రాకపోతే నచ్చదు. ఆ సమస్య లేకుండా ఏస్ 6 అల్ట్రాలో ఏకంగా 8,000mAh భారీ బ్యాటరీని ఇస్తున్నారట. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే చాలు.. రోజంతా నిశ్చింతగా వాడుకోవచ్చు. దానికి తోడు 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం కూడా ఉండటంతో, ఇంత పెద్ద బ్యాటరీ కూడా చాలా త్వరగానే ఫుల్ అయిపోతుంది.

ధర ఎంత ఉండొచ్చు?

పాత మోడల్స్ ధరలను బట్టి చూస్తే.. ఈ అల్ట్రా ఫోన్ కూడా రీజనబుల్ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముందుగా చైనాలో లాంచ్ చేసి, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారు. అయితే ఇండియాలో దీని పేరు ఏముంటుంది? ఏ ప్రైస్ పాయింట్‌లో వస్తుంది? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా మిడ్‌రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా బెస్ట్ ఆప్షన్ కాబోతోంది. మరిన్ని వివరాలు తెలియాలంటే కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే మరి.

Also Read: కలా? నిజమా? iPhone 15 రూ.35,000కే వచ్చేస్తోంది.. ఇవిగో పూర్తి వివరాలు!

 

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×