E-Paper
Advertisement

రూ.41,500 జీతంతో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు భయ్యా, అప్లై చేసుకోవచ్చు

రూ.41,500 జీతంతో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు భయ్యా, అప్లై చేసుకోవచ్చు
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.  ముంబయి కేంద్రంగా పనిచేసే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో పలు పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు తమకు నచ్చిన ఏదైనా ఒక నగరంలోని ఖాళీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సంస్థ స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలకు దరఖాస్తు చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 180

Advertisement

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 2026 ఏప్రిల్ 1వ తేదీ నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1996 ఏప్రిల్ 2వ తేదీ కంటే ముందు.. 2005 ఏప్రిల్ 1వ తేదీ తర్వాత జన్మించిన వారు ఈ ఉద్యోగాలకు అనర్హులు.

Advertisement

జీతం: ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.38,709 నుంచి రూ.41,509 వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఉద్యోగాల ఎంపిక కోసం ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని తదుపరి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష కేవలం ఇంగ్లిష్ భాషలో మాత్రమే ఉంటుంది. పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉన్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. 2026 జూన్ మొదటి వారంలో ఈ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాలి.

ముఖ్యమైన తేదీలు: 2026 ఏప్రిల్ 16వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు సమర్పించడానికి 2026 ఏప్రిల్ 30వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు.

ఎగ్జామ్ తేదీ: 2026 జూన్ మొదటి వారం..

ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా జీఎస్‌టీ వర్తిస్తుంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని సంస్థ స్పష్టం చేసింది.

బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://cdn.lichousing.com/

ALSO READ: నిరుద్యోగులకు పండుగలాంటి వార్త.. భారీగా కానిస్టేబులో పోస్టులు, ఇంకా 4 రోజులే భయ్యా..!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×