E-Paper
Advertisement

Samsung Galaxy S26 Ultra: శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫీచర్లు లీక్.. కెమెరా, బ్యాటరీ, కీలక వివరాలు మీ కోసం!

Samsung Galaxy S26 Ultra: శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫీచర్లు లీక్.. కెమెరా, బ్యాటరీ, కీలక వివరాలు మీ కోసం!

Samsung Galaxy S26 Ultra: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అధికారికంగా కంపెనీ నుంచి ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ.. ప్రముఖ వెబ్‌సైట్ ఆండ్రాయిడ్ హెడ్ లైన్స్ ద్వారా ఈ సిరీస్‌లోని టాప్ మోడల్ Galaxy S26 Ultra స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. గతేడాది విడుదలైన మోడల్ S25 అల్ట్రాతో పోలిస్తే.. దీనిలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఈ Samsung Galaxy S26 Ultra ఫోన్ 6.9 అంగుళాల భారీ QHD+ డైనమిక్ AMOLED డిస్‌ప్లతో రానుంది. చూడటానికి చాలా ఫ్లాట్‌గా, సన్నని బెజెల్స్‌తో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అలాగే దీనిలో క్వాల్కమ్ నుంచి రాబోతున్న అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు మంచి స్పీడ్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ UI 8.5 సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ 5G ఫోన్ కావాలా? రూ.15,499కే 7000mAh బ్యాటరీతో రియల్‌మీ నార్జో 90 ఉందిగా!

ఇకపోతే శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా ఫోన్‌లో 200MP మెయిన్ కెమెరాను ఇస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు 50MP అల్ట్రావైడ్, 10MP టెలిఫొటో, 50MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాలు, ఇక సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000mAh బ్యాటరీతో పాటు వైర్‌లెస్ పవర్ షేర్ ఫీచర్ కూడా ఉంది. దీంతో వేరే ఫోన్‌లను లేదా ఇయర్‌బడ్స్‌ను కూడా చార్జ్ చేసుకోవచ్చు.

ఈ S26 అల్ట్రా డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండబోతుందని లీక్స్ సూచిస్తున్నాయి. ఇది కేవలం 7.9mm మందం, 214 గ్రాముల బరువుతో తేలిగ్గ ఉంటుందట. కోబాల్ట్ వైలెట్, సిల్వర్ షాడో, పింక్ గోల్డ్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. శాంం‌సంగ్ సిగ్నేచర్ ఫీచర్ అయిన S-Pen సపోర్ట్ మాత్రం యథావిథిగా కొనసాగుతుంది.

Also Read: 200MP కెమెరాతో రియల్‌మీ 16 ప్రో ఎంట్రీ.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు గట్టి పోటీ తప్పదేమో!

Related News

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

ఇల్లంతా చల్లగా ఉండాలా.. సెంట్రలైజ్డ్ ఏసీ బెస్ట్ భయ్యా.. కాకపోతే!

అబ్బా ఏం ఆఫర్..శాంసంగ్ లేటెస్ట్ 5G ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇక మీదే ఆలస్యం!

సైలెంట్‌గా మొబైల్ మార్కెట్‌లో దిగిన Honor X7e.. ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కుయండి!

కదిలే ఏసీ కావాలా? 2026లో టాప్ ఇవే.. ఎక్కడకెళ్లినా మీ వెంటే!

Big Stories

×