E-Paper
Advertisement

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!

ఈ స్మార్ట్‌వాచ్ దెబ్బకు మార్కెట్ షేకవ్వాల్సిందే.. భారీ అప్‌గ్రేడ్‌తో Galaxy Watch 9!
Advertisement

Samsung Galaxy Watch 9: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తమ తదుపరి తరం స్మార్ట్‌వాచ్ ‘గెలాక్సీ వాచ్ 9’ను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. దీని గురించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ.. టెక్ వర్గాల్లో దీనికి సంబంధించిన లీకులు చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. మునుపటి మోడళ్లతో పోలిస్తే.. ఈ కొత్త వాచ్‌లో అనేక ఆసక్తికరమైన మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

మరింత బ్రైట్‌గా డిస్‌ప్లే..

ఈ Samsung Galaxy Watch 9 డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండనుంది. చాలా సన్నటి బెజెల్స్‌తో పాటు మరింత బ్రైట్‌నెస్‌ ఇచ్చే AMOLED స్క్రీన్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. దీంతో ప్రకాశవంతమైన ఎండలో కూడా వాచ్ స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే డిజైన్ పరంగా కొత్త రంగులు, ప్రీమియం ఫినిషింగ్‌తో రానుంది.

Advertisement

Also Read: ఛార్జర్ లేదా? డోంట్ వర్రీ.. ఫోన్ బ్యాటరీ ఫుల్ చేయడానికి ఈ ఒక్క కేబుల్ చాలు!

వేగవంతమైన పనితీరు..

ఈ వాచ్‌లో కొత్త ఎగ్జినోస్ ప్రోసెసర్‌ను ఉపయోగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా యాప్‌లు చాలా వేగంగా ఓపెన్ అవ్వడమే కాకుండా.. నేవిగేషన్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక యూజర్లను ఎక్కువగా వేధించే బ్యాటరీ సమస్యకు ఈసారి పరిష్కారం లభించనుంది. ప్రాసెసర్ సమర్థత, పెద్ద బ్యాటరీ కారణంగా సింగిల్ ఛార్జ్‌తో ఎక్కువ సేపు పనిచేస్తుందని భావిస్తున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు..

Advertisement

ఈ రోజుల్లో ప్రతి గ్యాడ్జెట్‌లోనూ AI కీలక పాత్ర పోషిస్తోంది. Galaxy Watch 9లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. శాంసంగ్ ఫోన్లతో ఇది చాలా సులభంగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యాంశాలను సంక్షిప్తంగా చూపించడం, మరింత మెరుగైన వాయిస్ అసిస్టెంట్ సేవలు అందించడంలో ఈ AI సాంకేతికత ఉపయోగపడుతుంది.

మెరుగైన హెల్త్ ట్రాకింగ్..

ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే విషయంలో శాంసంగ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఈ కొత్త వెర్షన్‌లో హార్ట్ రేట్, నిద్ర నాణ్యత, మానసిక ఒత్తిడి వంటి అప్డేట్‌లను మరింత కచ్చితత్వంతో చూపిస్తుంది. ప్రతిరోజూ మనం చేసే వ్యాయామాలను గుర్తించి, AI సాయంతో వ్యక్తిగత ఆరోగ్య సూచనలను కూడా అందిస్తుంది. ఫిట్‌నెస్ ప్రేమికులకు ఈ వాచ్ మంచి ఎంపిక కానుంది.

Also Read: భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×