KTR: మంచిర్యాల జిల్లా లక్షేటిపేటలో జరిగిన రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటిఆర్ మే నెలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంలో ప్రహరీ గోడ కూలి మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు పార్టీ తరపున 5 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. అనంతరం ఈల కార్యక్రమంలో ప్రసంగించారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో పంటను అమ్ముకోలేక, కొనుగోలు కేంద్రం లోనే ఈ నలుగురు రైతులు కన్నుమూశారని అన్నారు. వాళ్లను ఆదుకున్న పాపనా ఈ ప్రభుత్వం పోలేదిని అన్నారు. పార్టీ తరపున ఒక్కో రైతుకు ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయించి ఇచ్చామని, కేసీఆర్ ఉన్నపుడు షాపులో దొరికే యూరియాను రేవంత్ రెడ్డి యాప్‌లో పెట్టాడని అన్నారు. కళ్ళముందే గోదావరి, పై నుండి ప్రాణహిత పారుతున్న లాభం లేకుండా పోతుందని అన్నారు.
కాళేశ్వరం పై చిల్లర ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోతే మొత్తం కాళేశ్వరం కుప్పకూలినట్లు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కన్నెపల్లి వద్ద నీటిని పంపు చేసే అవకాశం ఉన్న కేసీఆర్‌కు పేరొస్తుందని నీటిని ఎత్తిపోయడం లేదని అన్నారు. మేడిగడ్డకు సంబంధం లేకుండా కన్నెపల్లి నుండి ఎల్లంపల్లికు నీటిని ఎత్తిపోయవచ్చని, 100 మీటర్ల FRL ఉన్న మేడిగడ్డ బ్యారేజి నుండి బ్యారేజి గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంపుహౌస్ వద్ద 93.5 FRL ఉన్నప్పుడు ఈ పంప్ హౌస్ ద్వారా అన్నారం బ్యారేజీకు, అక్కడి నుండి స్వరస్వతి పంప్ హౌస్ ద్వారా సుందిల్ల బ్యారేజికు, అక్కడి నుండి పార్వతీ పంప్ హౌస్ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని పారించవచ్చు అని తేల్చి చెప్పారు.
Also Read: సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!
ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్ నుండి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చు. ఇలా మేడిగడ్డకు సంబంధం లేకుండా కన్నెపల్లి నుండి ఎల్లంపల్లి వరకు నీటిని పంప్ చేయవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉన్న వర్షభావ పరిస్థితుల్లో కూడ తెలంగాణలో కరువు ఏర్పడకుండా ఉండేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశామని కేటీఆర్ తెలిపారు. నాలుగు వందల కోట్లతో మేడిగడ్డ వద్ద ఏర్పడిన సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. L&T కంపెనీ ప్రభుత్వ డబ్బులు అవసరం లేకుండానే మరమత్తులు చేస్తామని చెబుతున్న ఈ మూర్ఖపు ప్రభుత్వం వినిపించుకోవటం లేదన్నారు. అక్కడ మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం కాదా అని అన్నారు. అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని చెబుతున్న తెలంగాణలో మళ్లీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాల్సిందే అని కేటీఆర్ అన్నారు.
ఈ ప్రభుత్వంకు 32 నెలలు గడిచిపోయాయి. ఇంకా ఉంది కేవలం 29 నెలలే అని అన్నారు. మంచిర్యాలలో కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసిపెట్టుకోండి మేం అధికారంలో వచ్చాక మిత్తితో సహా తిరిగి చెల్లిద్దాంమని ఫైర్ అయ్యారు. మంచిర్యాల ఎమ్మెల్యే పద్ధతి మార్చుకుని పద్ధతిగా మలచుకోవాలని, BRS కార్యకర్తలకు ఇబ్బందులు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి జాగ్రత్త అంటూ హెచ్చరిక్లలు చేశారు.
Also Read: Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!