Amitabh Bacchan:బాలీవుడ్ షెహన్‌షా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తనకు ఇటీవల సర్జరీ జరిగిందని, కొన్ని రోజులు ఐసీయూలో ఉండి డిశ్ఛార్జ్ అయ్యానంటూ ఆయన తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఈ వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న అమితాబ్‌కు హఠాత్తుగా ఏమైందంటూ నెటిజన్లు, సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ..
ఐసీయూ అనుభవం గురించి అమితాబ్ భావోద్వేగంగా మాట్లాడారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తన ఆరోగ్యం గురించి హృదయపూర్వకంగా చెప్పారు. “ఇంటికి వచ్చిన తర్వాత ఇదే చాలా కష్టమైన దశ” అని అన్నారు.శారీరకంగా, మానసికంగా మరియు ప్రాక్టికల్‌గా ఇది చాలా నరకం చూపిస్తోంది” అని ఆయన పేర్కొన్నారు. అయితే తనకు ఏ రకమైన సర్జరీ జరిగింది, ఎందుకు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందనే విషయాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఈ సందర్భంగా అమితాబ్ ఒక తాత్విక సందేశాన్ని కూడా తన అభిమానులతో పంచుకున్నారు. “మీరు ఎంతటి గౌరవనీయమైన ఛాంపియన్ అయినా, ఒక రోజు ఓటమి మిమ్మల్ని పలకరిస్తుంది. ఇది జీవితంలో అత్యంత కష్టమైన ఘట్టం” అంటూ రాసుకొచ్చారు. ఇక కొంతమంది ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తే, మరికొందరు గత విజయాల జ్ఞాపకాల్లోనే ఉండిపోతారని, ఎవరైతే చివరి వరకు పోరాడతారో వారే ఎప్పటికీ ఛాంపియన్లుగా మిగులుతారని ఆయన ఆవేదనగా వెల్లడించారు.
ALSO READ:షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!
ఇటీవలే ‘కల్కి 2898 AD’ సినిమాలో అశ్వత్థామగా తన అద్భుత నటనతో అలరించిన అమితాబ్, రాబోయే ‘కల్కి 2’ లో కూడా కీలక పాత్రలో నటించనున్నారు. 83 ఏళ్ల వయసులో కూడా ఆయన చూపిస్తున్న డెడికేషన్ ముచ్చటగొలుపుతున్నప్పటికీ, ఈ సర్జరీ వార్త అందరినీ కలవరపెడుతోంది. ఇక ఆయన త్వరగా కోలుకుని, మళ్లీ పూర్వపు ఆరోగ్యంతో సెట్స్‌లోకి అడుగుపెట్టాలని కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
83 ఏళ్ల వయసులోనూ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో ఎంతో చురుగ్గా దూసుకుపోతున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2’లో ఆయన మళ్లీ పవర్‌ఫుల్ అశ్వత్థామ పాత్రలో అలరించనున్నారు. దీంతో పాటు నిమ్రత్ కౌర్‌తో కలిసి ‘సెక్షన్ 84’ అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర లోనటించనున్నారు.
తన తనయుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి పొలిటికల్ క్రైమ్ డ్రామా ‘సర్కార్ 4’లో కనిపించబోతున్నారు. అలాగే రణబీర్ కపూర్, అలియా భట్‌లతో కలిసి మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ అడ్వెంచర్ ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ 2’లో గురు రఘు పాత్రను పునరావృతం చేయనున్నారు. ఈ వరుస పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో ఆయన ఇండియన్ సినిమాలో తన సరిసాటి లేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.ఇక ఆయన త్వరగా కోలుకుని, మళ్లీ పూర్వపు ఆరోగ్యంతో సెట్స్‌లోకి అడుగుపెట్టాలని కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
అమితాబ్‌కు ఏమైంది?.. అభిమానుల ఆందోళన #AmitabhBachchan #hospitalisation #surgery #BollywoodNews #BIGTVCinema @SrBachchan @AmitabhBachan @iamAmitabh pic.twitter.com/nCIcoDS8ga
— BIG TV Cinema (@BigtvCinema) July 21, 2026