E-Paper
Advertisement

ఇప్పటివరకు చూసిన ఫోల్డబుల్ ఫోన్లు వేరు, ఇది వేరు.. శాంసంగ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!

ఇప్పటివరకు చూసిన ఫోల్డబుల్ ఫోన్లు వేరు, ఇది వేరు.. శాంసంగ్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Advertisement

Samsung 360 Foldable Phone: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో సరికొత్త విప్లవానికి శాంసంగ్ తెరలేపబోతోంది. జులై 22న జరగబోయే Galaxy Unpacked ఈవెంట్‌లో సరికొత్త మోడళ్లను పరిచయం చేయడానికి కంపెనీ సిద్ధమవుతుండగా.. మరోవైపు సరికొత్త డిజైన్లతో ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ తరహాలోనే ఉంటూ.. ఏకంగా 360 డిగ్రీలు మడతపెట్టగలిగే ఒక సరికొత్త ఫోన్ పేటెంట్‌ను శాంసంగ్ నమోదు చేసింది.

రెండు వైపులా మడతపెట్టేలా డిజైన్:

సాధారణంగా ఇప్పుడున్న ఫోల్డబుల్ ఫోన్లు కేవలం లోపలికి మాత్రమే మడతపడతాయి. కానీ, లీకైన ఈ కొత్త పేటెంట్ వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌ను లోపలికే కాకుండా బయటి వైపుకు కూడా పూర్తిగా మడతపెట్టవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన 360-డిగ్రీల హింజ్ (మడత కీలు) మెకానిజాన్ని శాంసంగ్ రూపొందించింది. ఇది వినియోగదారులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఆకట్టుకునే కర్వ్‌డ్ డిస్‌ప్లే:

Advertisement

ఈ ఫోన్ పైభాగంలో బయటి వైపు వంపు తిరిగిన (కర్వ్‌డ్) స్క్రీన్‌ను అమర్చారు. ఫోన్‌ను లోపలికి మడతపెట్టినప్పుడు మెయిన్ స్క్రీన్ సురక్షితంగా లోపలే ఉంటుంది. అదే సమయంలో బయట ఉండే ఈ చిన్న కర్వ్‌డ్ స్క్రీన్ ద్వారా ఫోన్ ఓపెన్ చేయకుండానే నోటిఫికేషన్లు చూడటం, కాల్స్ మాట్లాడటం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం, కెమెరా ప్రివ్యూ వంటి పనులన్నీ సులువుగా చేసుకోవచ్చు.

Also Read: Tecno Camon 50 Ultra 5G భారత్‌లోకి వచ్చేసింది.. రూ.3,000 లాంచింగ్ ఆఫర్, ఆ తేదీ నుంచే సేల్!

సాంకేతిక సవాళ్లు లేకపోలేదు:

Advertisement

వంపు తిరిగిన డిస్‌ప్లేను, 360 డిగ్రీలు తిరిగే హింజ్‌తో కలపడం ఇంజనీర్లకు పెద్ద సవాలుగా మారింది. ఫోన్ మడతపెట్టినప్పుడు స్క్రీన్లు ఒకదానికొకటి ఢీకొట్టకుండా హింజ్ దగ్గర చిన్న గ్యాప్స్ ఉంచారు. అయితే, దీనివల్ల డిస్‌ప్లే వైరింగ్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు.. శాంసంగ్ అంతర్గతంగా మల్టిపుల్ లేయర్ల ద్వారా వైరింగ్ రూటింగ్‌ను మార్చింది. దీనివల్ల వైర్లు ఒకదానికొకటి తగలకుండా సిగ్నల్స్ అందుతాయి.

భవిష్యత్తుపై శాంసంగ్ గురి:

సాధారణంగా కంపెనీలు నమోదు చేసే అన్ని పేటెంట్లు మార్కెట్లోకి ఫోన్లుగా రావు. కానీ, భవిష్యత్తులో శాంసంగ్ ఎలాంటి టెక్నాలజీతో రాబోతుందో తెలుసుకోవడానికి ఈ పేటెంట్ ఒక చక్కని ఉదాహరణ. ఒకవేళ ఈ డిజైన్ నిజంగానే మార్కెట్లోకి వస్తే మాత్రం, ఫోల్డబుల్ ఫోన్ల ప్రపంచంలో శాంసంగ్ రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం.

Also Read: భారత్‌లోకి Poco సరికొత్త ఫోన్.. ఏకంగా 8000mAh బ్యాటరీతో రచ్చ లేపనున్న M8 Power!

Tags

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×