E-Paper
Advertisement

అప్పుడు ఓ అడుగు వెనక్కి తగ్గాం.. ఇప్పుడు తగ్గేదిలేదు-మంత్రి నాదెండ్ల

అప్పుడు ఓ అడుగు వెనక్కి తగ్గాం.. ఇప్పుడు తగ్గేదిలేదు-మంత్రి నాదెండ్ల
Advertisement

Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలోని పార్టీలు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. నేతలతో అధినేతలు సమావేశాలు, కేడర్‌తో భేటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పరిస్థితులను బట్టి వెనక్కి తగ్గామన్నారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షురూ-ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రంగం షురూ అవుతోంది. అక్టోబరు లేకుంటే నవంబర్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని కూటమి భావిస్తోంది. ఈలోగా నేతలు, కేడర్‌ని సమాయాత్తం చేస్తున్నాయి టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు. వారంలో ఎలాగ లేదన్నా నేతలతో ఒక్కసారి భేటీ అవుతున్నారు అధినేతలు. జరుగుతున్న పరిణామాలు గమనించిన వైసీపీ కూడా అదే బాటలో నడుస్తోంది.

Advertisement

కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నాదెండ్ల-వైసీపీని ఒకటే సమస్య వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కూటమి కలిసి వెళ్తుందా? లేకుంటే ఆయా పార్టీలు విడి విడిగా పోటీ చేస్తారా? అనే డౌట్ అనుక్షణం వెంటాడుతోంది. దీనిపై  మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన, 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

అప్పుడు ఓ అడుగు వెనక్కి తగ్గాం-అప్పటి పరిస్థితిని బట్టి ఓ అడుగు వెనక్కు తగ్గామన్నారు. అప్పుడు వర్తించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వెళ్లాలా లేకుంటే సొంతంగా పోటీ చేయాలా అనేదానిపై ఎన్డీయే కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పేశారు.

Advertisement

స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఆధారపడి ఉంటుందన్నారు. కూటమి బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. జనసేనలో కష్టపడి పని చేసేవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే..  సొంతంగా ఎవరికి వారు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

ALSO READ: శవానికి తాళి కట్టు.. ప్రియుడిపై చనిపోయిన యువతి బంధువులు ఒత్తిడి, అసలేం జరిగిందంటే?

అదే జరిగితే వైసీపీకి ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు.  ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి జనసేన తరపున మంత్రి నాదెండ్ల చెప్పడం ఇదే తొలిసారి. మొత్తానికి మంత్రి నాదెండ్ల మాటలతో వైసీపీలో ఎక్కడో గుబులు మొదలైనట్టు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×