E-Paper
Advertisement

Ranga Reddy News: సర్పంన్పల్లి ప్రాజెక్టు నీటితో అక్రమంగా కోట్ల వ్యాపారం.. ప్రమాదాలు జరిగిన పట్టించుకోని అధికారులు

Ranga Reddy News: సర్పంన్పల్లి ప్రాజెక్టు నీటితో అక్రమంగా కోట్ల వ్యాపారం.. ప్రమాదాలు జరిగిన పట్టించుకోని అధికారులు

Ranga Reddy News: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులల్లో వికారాబాద్ జిల్లాలోని సర్పంన్పల్లి ఒకటి. గత ప్రభుత్వంలో వివాదలకు కేరఫ్ గా ఉండే మాజీ ఎమ్మెల్యే అండదండలతో అసైండ్ భూమిని రైతుల వద్ద లీజు పేరుతో అగ్రిమెంట్ చేసుకొని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అసైండ్ భూములు సర్పంన్పల్లి ప్రాజెక్టు కు అనుకోని ఉండటంతోనే ఆ మాజీ ఎమ్మెల్యే కన్నెశారు. గత ప్రభుత్వంలో అధికారులు ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. ఈ ప్రభుత్వంలో కూడా విషంగా మారుతున్న చెరువును పట్టించుకోవడంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారు. ఇదంతటికి కారణం వికారాబాద్ జిల్లాలో క్రియాశీలక పదవిలోనున్న మాజీ మంత్రి హస్తం ఉందని జోరుగా ప్రచారం సాగుతుంది. గత ప్రభుత్వంలో అక్రమార్కులకు పాల్పడిన వారి పై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లు వ్యవహరించడం పై అనుమానాలకు తావునిస్తుంది.

నెల నెల ముడుపులకు అలవాటు

సర్పంన్పల్లి ప్రాజెక్టుతో పేద, మధ్యతరగతి రైతు కుటుంబాలకు ఉపాధి ఉండేది. అంతేకాకుండా స్థానిక మత్స్యకారులు చెపల పెంపకంతో జీవనోపాధి కల్పించుకునే వారు. అలాంటి పేదలను చెరువుకు దూరం చేసి ఓ వ్యాపారి చేతిలో బంది అయ్యిందని చెప్పడంలో మోహమాటం లేదు. గత ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యే ఆడిందే అట పాడిందే పాటగా కొనసాగింది. అదే పద్ధతిని ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగడం… ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికే వివాదాలు ఎదుర్కొంటూ జైలు కు పోవడం జరిగింది. అలాంటి బీనామీ వ్యాపారికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలకు, అధికారులుకు నెల నెల ముడుపులు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. స్థానిక ప్రజలను ఆ చెరువు వైపు కన్నెత్తి చూడకుండా ఉండేందుకు బౌన్సర్స్లతో భారీ బందోబస్త్ను వ్యాపారి పెట్టారు. అక్కడికి వెళ్ళాలి అంటే గూగుల్ లో ది విల్డెర్నెస్ క్యాంపు సైట్ అని టైప్ చేయాలి. దాంతో ఆగూగుల్లో కనిపించే ఫొటోస్ అశ్వాదించాలి, అనుభవించాలంటే ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని వెళ్ళాలి. ఆన్లైన్ బుకింగ్ అంటే ఫ్రీ కాదు గంటకు రూ.10వేల.. మూడు గంటలు గడపాలంటే 30వేలు చెల్లించాలి. ఈ పద్దతిలో అక్కడ వ్యాపారం సాగుతుంది. ఇదంతా నీటి పేరుతో గలీజ్ దందా కొనసాగుతుంది. ఈదందా మొత్తం అక్రమ పద్దతిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది. కానీ ఈ అక్రమ పద్ధతితో దందా సాగించే వారి పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే చర్చ సాగుతుంది.

Also Read: KTR: ఓట్ల కోసం కోటి మోసాలు.. 840 రోజులైనా ఒక్క గ్యారెంటీ కూడా..? కేటీఆర్ సంచలన విమర్శలు

అసైండ్ భూమిలో ఈ ఆటలు

ఎంజాయ్ ఎలా చేసుకోవచ్చు అనే విషయాలు ఆన్లైన్లో అందంగా పొందుపర్చారు. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యులతో ఎలా సరదాగా గడుపుకోవచ్చు అనే విషయాలు అక్రమార్కులు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. అయితే వీళ్లు కలిపించే వసతులన్ని అసైండ్ భూమిలోనే. ఆ భూమిని పేద రైతుల వద్ద అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఒకటి రైతుల వద్ద లీజు, మరొకటి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్ చేసుకొని చుట్టూ ప్రహరీ, కంచె వేసుకొని దందా జోరుగా సాగిస్తున్నారు. ఇదే అసైండ్ స్థలంలో అవుట్ డోర్ యాక్టివిటీస్ కింద బీచ్ వాలీబాల్, అడ్వెంచర్ రూప్, బాక్స్ ఫుట్ బాల్, బాక్స్ క్రికెట్ లాంటివి ఉచితం అని, అన్నిరకాల టెర్రాయిన్ వెకిల్స్ రైడ్ కు, డైర్ట్ బైక్ రైడ్ చేయడానికి రూ.500 ఫర్ 4 లాప్స్ చొప్పున వసులు చేస్తున్నారు. ఈ డేంజరస్ రైడ్ కి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. టూరిజం నుండి నామమాత్రపు అనుమతులు తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్న పరిస్థితి. ఇదే కాకా ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్న సర్పంపల్లి ప్రాజెక్ట్ పై అక్రమంగా బోటింగ్ నిర్వహిస్తూ దీనిపై కూడా వేలలో డబ్బులు వాసులు చేస్తున్నారు. ఒక్కరు 20 నిమిషాల పాటు బోటింగ్ చేస్తే రూ.500, ఇద్దరు చేస్తే రూ.800, మోటార్ బోట్ రూ,2000 చొప్పున అనేక విధాలుగా వసూలు చేస్తున్నారు. ఇవే కాకా ఇక్కడ మరో ప్రధాన వ్యాపారం హోమ్ బోట్. ఈ హోమ్ బోటింగ్ లో ఎంజాయ్ చేయాలంటే వేలల్లో చెల్లించాల్సిందే. ఒకవేళ ఇందులో ఏదైనా పార్టీ చేసుకోవాలి అంటే కేవలం 3 గంటలకు రూ.30,000 పైనే వసూలు చేస్తున్నారు. పైగా పెద్ద పెద్ద బోరు మోటార్ల సహాయంతో ప్రాజెక్ట్ లోని నీటిని కూడా అక్రమంగా దొంగిలించి రిసార్ట్స్ అవసరాలకు వాడుతున్న పరిస్థితి. టెంట్ అయితే ఒక జంటకు రూ.1800, లగ్జరీ ఎసి రూమ్స్ అయితే ఏకంగా రూ.5000 అని రేట్లు పెట్టారు.

ప్రమాదం జరిగిన సోయి లేదు

ఈ ప్రాజెక్టులో నిర్వహించే ఎంజాయ్ కోసం ఓ కుటుంబం యాత్రకు వచ్చింది. నిర్వాకుడి నిర్వాకంతో ఇటీవల ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మరణించారు. ఆ విషయం బయటికి పొక్కకుండా అటు అధికారులను.. ఇటు పోలీసులును ఒప్పించి కేసు లేకుండా నిర్వాకుడు బయట పడటం విశేషం. ఇంత జరిగిన అధికారులు స్పందించకపోవడం దారుణం.

కలెక్టర్ గారు జర ఇటు చూడండి

రాష్ట్ర ప్రభుత్వం చెరువులను, ప్రభుత్వ అధీనంలోని భూములను కాపాడాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే హైడ్రా తో కబ్జాదారుల చేతిలో బందియైన చెరువులు, ప్రభుత్వ భూములకు విముక్తి కల్పిస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ ఆశయాలను అధికారులు గాలికి వదిలేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో సర్పంన్పల్లి ప్రాజెక్టు విష కౌగిలిలో ఉందని తెలుస్తుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని వికారాబాద్ కలెక్టర్ విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్పందించి అధికారులకు మద్దతు తెలుపాలని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు సీరియస్ గా తీసుకోకపోతే వీరి పాత్రే కీలకమనే ప్రచారానికి ఆజ్యం పోసినట్టు ఉంటుంది.

Also Read: Allu Arjun -Atlee: అల్లు అర్జున్ అట్లీ సినిమాలో స్టార్ క్రికెటర్ వైఫ్.. థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×