E-Paper
Advertisement

శాంసంగ్ ఫోన్ స్క్రీన్‌పై ఆ చిన్న చుక్క ఎందుకు మెరుస్తుంది? హ్యాకర్ల పనేనా.. అసలు నిజం ఇదీ!

శాంసంగ్ ఫోన్ స్క్రీన్‌పై ఆ చిన్న చుక్క ఎందుకు మెరుస్తుంది? హ్యాకర్ల పనేనా.. అసలు నిజం ఇదీ!
Advertisement

Samsung Screen Blinking Dot: మనం ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ను చెవి దగ్గరకు తీసుకెళ్లగానే స్క్రీన్ లైట్ ఆరిపోతుంది. స్క్రీన్‌పై మన చెంప తగిలి కాల్ కట్ అవ్వకుండా లేదా వేరే ఆప్షన్స్ ఓపెన్ కాకుండా ఉండటానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీనికోసం స్మార్ట్‌ఫోన్లలో ‘ప్రాక్సిమిటీ సెన్సార్’ అనే ఒక చిన్న పరికరాన్ని వాడుతుంటారు. ఇది స్క్రీన్‌కు, మనకు మధ్య ఎంత దూరం ఉందో గమనిస్తూ ఉంటుంది. శాంం‌సంగ్ ఫోన్ వాడుతున్న చాలామందికి స్క్రీన్ పైభాగంలో ఒక చిన్న చుక్క మెరుస్తూ కనిపిస్తుంది. అది మరేదో కాదు.. ఈ సెన్సార్ పని చేస్తున్నప్పుడు వచ్చే లైట్ మాత్రమే.

కొత్త ఫోన్లలోనే ఎందుకు కనిపిస్తుంది?

పాత తరం ఫోన్లతో పోలిస్తే.. ఇప్పటి ఆధునిక శాంసంగ్ ఫోన్లలో ఈ మెరిసే చుక్క ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే.. పాత మోడల్ ఫోన్లకు స్క్రీన్ పైనా, కిందా ఖాళీ స్థలం (బెజెల్స్) ఎక్కువగా ఉండేది. దాంతో ఈ సెన్సార్‌ను ఆ ఖాళీ స్థలంలో దాచేవారు.

Advertisement

కానీ ఇప్పుడు వస్తున్న గెలాక్సీ ఎస్26 లాంటి ఫోన్లలో స్క్రీన్ మొత్తం డిస్‌ప్లేనే ఉంటోంది. అందువల్ల శాంసంగ్ సంస్థ ఈ సెన్సార్‌ను నేరుగా స్క్రీన్ లోపల, అంటే డిస్‌ప్లే వెనుక అమర్చింది. అందుకే ఫోన్ మాట్లాడేటప్పుడు ఆ లైట్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

Also Read: ఇక ఏసీ గాలి నేరుగా ఒంటికి తగలదు..: శాంసంగ్ తెచ్చిన ఈ సరికొత్త AI ఏసీ చూశారా?

దీన్ని ఆఫ్ చేయడం సాధ్యమేనా?

Advertisement

ఈ చిన్న వెలుతురును చూసి ఫోన్ ఏదో పాడైపోయిందని చాలామంది కంగారుపడుతుంటారు. కారు డాష్‌బోర్డ్‌లో లైట్లు వెలిగితే ఏదో సమస్య ఉందని అర్థం. కానీ ఫోన్ విషయంలో అలా కాదు. ఇది సెన్సార్ పనితీరుకు సంకేతం మాత్రమే. అయితే, ఈ బ్లింక్ అయ్యే లైట్‌ను ఆపివేయడం యూజర్ల చేతుల్లో లేదు.

శాంసంగ్ ఎస్5 మోడల్ తర్వాత వచ్చిన ఏ ఫోన్‌లోనూ ఈ సెన్సార్‌ను ఆఫ్ చేసే ఆప్షన్ లేదు. ఒకవేళ దీన్ని ఆపేస్తే, మాట్లాడేటప్పుడు స్క్రీన్ లైట్ ఆఫ్ కాదు. అయితే, మీరు బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ లేదా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే మాత్రం ఈ లైట్ వెలగదు.

సెన్సార్ సరిగ్గా పని చేయకపోతే?

కొన్నిసార్లు ఈ సెన్సార్ సరిగ్గా పని చేయకపోతే, కాల్ ముగిసినా స్క్రీన్ లైట్ ఆన్ కాదు. అలాంటప్పుడు ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘డబుల్ టాప్ టు టర్న్ ఆన్ స్క్రీన్’ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. దీనివల్ల స్క్రీన్‌పై రెండుసార్లు నొక్కితే లైట్ ఆన్ అవుతుంది.

స్క్రీన్ పైన ఉండే మురికి, జిడ్డు లేదా స్క్రీన్ గార్డ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సెన్సార్ ఆగిపోవచ్చు. కాబట్టి మెత్తటి బట్టతో స్క్రీన్ పైభాగాన్ని తుడవాలి. అప్పటికీ సమస్య తగ్గకపోతే శాంసంగ్ మెంబర్స్ యాప్‌లోకి వెళ్లి టెస్ట్ చేసుకోవచ్చు లేదా ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేసి చూడాలి. అప్పటికీ కాకపోతే సర్వీస్ సెంటర్‌ను సంప్రదించడం మంచిది.

Also Read: ఏసీ బిల్లును సగానికి తగ్గించే ‘20 డిగ్రీల నియమం’.. ఇదెలా పనిచేస్తుందంటే?

Related News

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

Big Stories

Advertisement
×