E-Paper
Advertisement

Samsung 20000mAh: ఆపిల్, చైనా ఫోన్ కంపెనీలకు చుక్కలే.. 20,000mAh బ్యాటరీ ఫోన్స్‌తో శాంసంగ్ సంచలనం

Samsung 20000mAh: ఆపిల్, చైనా ఫోన్ కంపెనీలకు చుక్కలే.. 20,000mAh బ్యాటరీ ఫోన్స్‌తో శాంసంగ్ సంచలనం
Advertisement

Samsung 20000mAh Battery| స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు మార్కెట్‌లో కొత్త కొత్త ఫీచర్స్‌తో ఫోన్లు విడుదల చేస్తూ పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ టెక్నాలజీ వేగంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్లు ఎక్కువ సమయం పనిచేసేందుకు బ్యాటరీలను కొత్త మెటీరియల్స్, అడ్వాన్స్ డిజైన్‌లతో తయారు చేస్తున్నాయి. దీని కోసం వేగంగా ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా శాంసంగ్ కంపెనీ ఇలాంటి ప్రయోగం చేస్తోందని సమాచారం లీక్ అయింది. ఈ లీక్ ప్రకారం శాంసంగ్ చాలా పెద్ద కెపాసిటీ బ్యాటరీలు టెస్ట్ చేస్తోంది. ఇంటర్నల్ టెస్టింగ్ డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. శాంసంగ్‌కు చెందిన బ్యాటరీ కంపెనీ SDI ఈ ప్రాజెక్ట్‌ నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో.. సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో 12,000mAh, 18,000mAh, 20,000mAh బ్యాటరీలు టెస్ట్ అవుతున్నాయి. ఈ టెక్నాలజీతో బ్యాటరీ సైజ్ పెంచకుండానే దాని కెపాసిటీ భారీగా పెరుగుతుంది.

శాంసంగ్ SDI సిలికాన్ కార్బన్ బ్యాటరీలు

శాంసంగ్ బ్యాటరీ విభాగం.. శాంసంగ్ SDI ఈ రీసెర్చ్‌ను నడుపుతోంది. సిలికాన్ కార్బన్ బ్యాటరీలు సాధారణ లిథియం బ్యాటరీల కంటే ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఇస్తాయి. లిథియం బ్యాటరీలు ఎక్కువ లైఫ్ ఇవ్వాలంటే వాటి సైజుని పెంచాలి. దీంతో ఫోన్ సైజ్ కూడా పెరిగిపోతుంది. కానీ సిలికాన్ కార్బన్ బ్యాటరీలతో ఈ సమస్యను అధిగమించే అవకాశాలున్నాయి. బ్యాటరీ కెపాసిటీని పెంచేందుకు దాని సైజు పెంచాల్సిన అవసరం లేదు. అయితే వీటి తయారీలో కొన్ని ఇంజినీరింగ్ సవాళ్లు ఉన్నాయి.

ట్విట్టర్ Xలో లీక్ అయిన సమాచారం

Advertisement

ఈ వివరాలు X (ట్విట్టర్)లో లీక్ అయ్యాయి. ఒక యూజర్ ఇంటర్నల్ టెస్ట్ రిపోర్టుల స్క్రీన్‌షాట్లు పోస్ట్ చేశాడు. లీక్‌ అయిన సమాచారాన్ని శాంసంగ్ ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు.

12,000mAh బ్యాటరీ టెస్ట్ వివరాలు

ఈ బ్యాటరీ ఇంటర్నల్ పేరు SDI DC12K SiC V2. ఇందులో డ్యూయల్-సెల్ స్ట్రక్చర్‌ ఉంటుంది. మొదటి సెల్ 6,800mAh (4.7mm మందం), రెండో సెల్ 5,200mAh (3.2mm మందం). మొత్తం 12,000mAh కెపాసిటీ వస్తుంది. శాంసంగ్ ఈ బ్యాటరీల మొత్తం మందం 9.3mm కంటే తక్కువగా ఉంచాలని లక్ష్యంగా పనిచేస్తోంది. కానీ కొన్ని టెస్ట్ యూనిట్లు ఆ లిమిట్ దాటాయి. అందుకే వాటి డిజైన్ సర్దుబాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

18,000mAh బ్యాటరీ డిజైన్

Advertisement

ఈ మోడల్ పేరు SDI TC18K SiC. ఇది ట్రిపుల్-సెల్ డిజైన్‌తో ఉంది. మూడు సెల్స్ కెపాసిటీలు: 6,699mAh, 6,000mAh, 5,257mAh. ఈ మూడు బ్యాటరీల మందం.. 4.2mm, 3.9mm, 3.28mm. ఈ ట్రిపుల్ సెల్ మొత్తం థిక్‌నెస్ (మందం) 12.3mm టార్గెట్ పెట్టారు. కానీ థర్మల్ ప్రొటెక్షన్ లేయర్ల వల్ల 12.8mm అయింది. అందుకే ఇప్పుడు సెల్ స్టాకింగ్, థర్మల్ డిజైన్ ఆప్టిమైజ్ చేస్తున్నట్లు లీక్ రిపోర్ట్ లో తెలిసింది.

బ్యాటరీ లైఫ్ సైకిల్స్ సమస్య

టెస్ట్ రిపోర్టుల ప్రకారం.. ఈ బ్యాటరీలు సుమారు 960 ఛార్జ్ సైకిల్స్ తర్వాత ఫెయిల్ అవుతున్నాయి. కానీ శాంసంగ్ మాత్రం.. ఈ బ్యాటరీలలో కనీసం 1,500 సైకిల్స్ దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం బ్యాటరీ స్ట్రక్చర్, ఫర్మ్‌వేర్‌లలో మార్పులు చేస్తున్నారు. దీర్ఘకాలం మంచి పర్‌ఫామెన్స్ ఇవ్వాలనేదే ఈ బ్యాటరీ తయారీ లక్ష్యం.

Also Read:  మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.. ఇల్లు, ఆఫీస్ రెండింటికీ ఉపయోగకరం

బ్యాటరీ పర్‌ఫామెన్స్ అంచనా

12,000mAh బ్యాటరీ సాధారణ ఉపయోగంలో 20 నుంచి 25 గంటల స్క్రీన్-ఆన్ టైమ్ ఇవ్వగలదు. 18000mAh, 20000mAh బ్యాటరీలు ఇంకా ఎక్కువ బ్యాకప్ ఇస్తాయి. అయితే ఇవి ఇంకా ప్రారంభ టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. భవిష్యత్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో లేదా ఫోల్డబుల్ ఫోన్లలో శాంసంగ్ వీటిని ఉపయోగించే అవకాశం ఉంది. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ విజయవంతమైతే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది.

Related News

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

Big Stories

Advertisement
×