BigTV English
Advertisement

Samsung Galaxy S25 Series : శామ్సంగ్ గెలాక్సీ S25 వచ్చేసిందోచ్! ఫస్ట్ ఆర్డర్ పై ఆఫర్సే ఆఫర్స్

Samsung Galaxy S25 Series : శామ్సంగ్ గెలాక్సీ S25 వచ్చేసిందోచ్! ఫస్ట్ ఆర్డర్ పై ఆఫర్సే ఆఫర్స్

Samsung Galaxy S25 Series :  శామ్సంగ్ తాజాగా లాంఛ్ చేసిన S25 మెుబైల్స్ ప్రీ ఆర్డర్స్ డెలివరీస్ ప్రారంభమయ్యాయి. ఇక ఈ మెుబైల్ ధర, ఆఫర్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవే.


ప్రీ ఆర్డర్ చేసిన Samsung Galaxy S25 సిరీస్ గ్యాడ్జెట్స్ ఇప్పుడు ప్రత్యేకమైన కలర్ ఆఫ్షన్స్ తో డెలివరీ చేయబడుతున్నాయి. యూజర్స్ ఫ్రీ స్టోరేజ్ అప్‌గ్రేడ్, ఎక్స్ఛేంజ్ బోనస్‌, బ్యాంక్ డిస్కౌంట్‌ సైతం పొందే ఛాన్స్ ఉంది. ఇక Galaxy S25 సిరీస్ లో బెస్ వేరియంట్ ధర రూ. 80,999 నుంచే ప్రారంభమవుతుంది. ప్రీ-ఆర్డర్‌లపై ఎక్స్ట్రా బెనిఫిట్స్ సైతం ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో శామ్సాంగ్ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ S25 అల్ట్రా, S25 ప్లస్, గెలాక్సీ S25 మెుబైల్స్ లాంఛ్ అయ్యాయి. ఈ మెుబైల్ అదిరే ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ తో అందుబాటులోకి వచ్చేసింది. ఇందులో డిస్ ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, కలర్ ఆఫ్షన్ ఫీచర్స్ దిమ్మ తిరిగేలా ఉన్నాయి. ఇక ఈ మెుబైల్స్ కోసం ప్రీ ఆర్డర్లు మెుదలయ్యాయి. జనవరి 23న ప్రారంభమైన ఈ ఆర్డర్స్ ఫిబ్రవరి 6 వరకు కొనసాగుతాయి. అందుకే ఈ లేటెస్ట్ మెుబైల్స్ కొనాలనుకునే యూజర్స్ కు ఇప్పటికీ ప్రీ ఆర్డర్ లో బుక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఫిబ్రవరి 7 నుండి స్టోర్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.


ఇక ఇండియాలో గెలాక్సీ S25 సిరీస్ ముందస్తు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీలు ప్రారంభమైనట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ కస్టమర్లు గెలాక్సీ S25 అల్ట్రాను టైటానియం జెట్‌బ్లాక్, టైటానియం జాడేగ్రీన్, టైటానియం పింక్‌గోల్డ్ కలర్ ఆఫ్షన్స్ లో పొందే ఛాన్స్ ఉందని తెలిపింది.

Samsung Galaxy S25 సిరీస్ ప్రీ బుకింగ్ బెనిఫిట్స్ –

ఈ మెుబైల్ ను ప్రీ బుకింగ్ లో బుక్ చేసుకునే యూజర్స్ కు ఫ్రీ స్టోరేజ్ అప్‌గ్రేడ్ సదుపాయంతో పాటు అదనంగా రూ. 9,000 అప్‌గ్రేడ్ బోనస్ లేదా రూ. 8,000 బ్యాంక్ ఆఫర్ పొందే ఛాన్స్ ఉంది.

Galaxy S25 కొనుగోలు చేయాలనుకునే యూజర్స్… ఉచిత స్టోరేజ్ అప్‌గ్రేడ్‌తో పాటు రూ. 11,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 10,000 బ్యాంక్ డిస్కౌంట్‌ కూడా పొందే ఛాన్స్ ఉంది. Galaxy S25 Plus కొనుగోలుదారులు ఉచిత స్టోరేజ్ అప్‌గ్రేడ్‌ను కూడా పొందొచ్చు. ఇందులో భాగంగా పాత మొబైల్ ను అప్డేట్ చేయాలనుకునే యూజర్స్ కు మరిన్ని బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ మొబైల్ పైన నో-కాస్ట్ EMI సదుపాయం కూడా కలదు.

Samsung Galaxy S25 Series Price –

Samsung Galaxy S25 –

12GB + 256GB – రూ. 80,999

12GB + 512GB- రూ. 92,999

Samsung Galaxy S25 Plus Price –

12GB + 256GB – రూ. 99,999

12GB + 512GB – రూ.1,11,999

Samsung Galaxy S25 Ultra price –

256GB- రూ. 129,999

512GB- రూ. 141,999

1TB- రూ. 1,65,999

ALSO READ : వివో V40 తో పోలిస్తే వివో V50 బెటరేనా! లేటెస్ట్ అప్ గ్రేడ్స్ ఏంటంటే!

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×