Road accident: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మహిళా ఎస్ఐ శ్వేతతోపాటు మరొక వ్యక్తి స్పాట్‌లో మృతి చెందారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఇంతకీ అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్లొద్దాం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విధుల్లో భాగంగా ధర్మారం వైపు నుండి జగిత్యాలకు వెళ్తున్నారు ఎస్ఐ శ్వేత. కారుని ఆమె సొంతగా తానే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయే అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఎస్ఐ కారు. ప్రమాదంలో మహిళ ఎస్సై కొక్కుల శ్వేత తోపాటు బైక్ రైడర్ అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రస్తుతం జగిత్యాల డీసీఆర్బీలో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్నారు శ్వేత. గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లి పలు పోలీసుస్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారామె. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు తరలించారు.
పంజాగుట్టులో కారు యాక్సిడెంట్:
మరోవైపు పంజాగుట్టు వద్ద డివైడర్ ను ఢీకొట్టింది ఓ కారు. బంజారాహిల్స్ వైపు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన తర్వాత కారుని అక్కడే వదిలి పరారయ్యారు అందులోని వ్యక్తులు. అయితే కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్య మత్తులో వాహనాన్ని నడిపారా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. కారు డీటేల్స్ ఆధారంగా ఆ వాహనం ఎవరిది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.