Vivo V50 Vs Vivo V40 : వివో V50, వివో V40తో పోలిస్తే లేటెస్ట్ ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చేసింది. Vivo V40 అదిరిపోయే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ తో అందుబాటులోకే వచ్చేసింది. అయితే ఇప్పుడు రాబోతున్న వివో V50 మొబైల్ లో మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అదిరే ప్రాసెసర్ తో ఈ మెుబైల్ లాంఛ్ కాబోతుంది. అయితే అసలు ఈ రెండు మొబైల్స్ మధ్య తేడాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Vivo V40, Vivo v15 మొబైల్స్ మధ్య ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ లో మార్పులు ఉన్నాయి. డిజైన్ తో పాటు ఫీచర్స్, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ స్పెసిఫికేషన్స్ లో మార్పులు ఉన్నాయి. మరి ఈ రెండు మొబైల్స్ మధ్య ఉన్న పూర్తి తేడాలు ఏంటో తెలుసుకుందాం.
డిజైన్ అండ్ డిస్ ప్లే –
Vivo V40లో 6.44 ఇంచుల AMOLED డిస్ ప్లే ఉంది. ఇక Vivo V50లో 6.7 ఇంచుల FHD+ AMOLED ఉండే అవకాశముంది. కొత్త Vivo V50 డిజైన్‌లో బేజిలెస్ డిస్ ప్లే, లార్జ్ సైజ్ స్కీన్, హై రిజల్యూషన్ తో బెస్ట్ ఫోటో/వీడియో క్వాలిటీ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది.
ప్రాసెసర్ అండ్ పనితీరు –
Vivo V40లో Qualcomm Snapdragon 695 చిప్‌సెట్ ఉంది కానీ Vivo V50లో Snapdragon 7 Gen 1 లేదా లేటెస్ట్ బెస్ట్ ఎక్స్‌ప్రో ప్రాసెసర్ ఉండొచ్చు. ఇది Vivo V50 మెుబైల్ కు అదిరే పనితీరు, బెస్ట్ గేమింగ్ సామర్థ్యం, ఆల్ రౌండ్ అనుభవాన్ని ఇస్తుంది. 8GB RAM + 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండొచ్చు.
కెమెరా –
Vivo V40లో 64MP ప్రైమరీ కెమెరా ఉంది అయితే Vivo V50లో 108MP లేదా మరింత మెరుగైన సెన్సార్ ఉండే ఛాన్స్ ఉంది. ఇది ఫోటోగ్రఫీని మరింత బెస్ట్ గా అందిస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా Vivo V50లో 32MP లేదా 44MP డిజిటల్ క్వాలిటీతో వచ్చే ఛాన్స్ ఉంది.
బ్యాటరీ ఛార్జింగ్ –
Vivo V40లో 5000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ Vivo V50లో 5000mAh లేదా దాని కంటే హై బ్యాటరీ కెపాసిటీ ఉండే ఛాన్స్ ఉంది. అదేవిధంగా 66W లేదా 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉండొచ్చు.
ఆపరేటింగ్ సిస్టమ్ – ఫీచర్స్ –
Vivo V40లో Funtouch OS 13 లేదా Android 13 ఉండగా, Vivo V50లో Android 14 లేదా అధునాతన ఫంక్షన్‌లతో బెస్ట్ ఇంటర్‌ఫేస్ ఉండే ఛాన్స్ ఉంది.
కనెక్టివిటీ –
Vivo V50లో 5G కనెక్టివిటీ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే, Wi-Fi 6, Bluetooth 5.3తో లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. స్లిమ్ ఫీచర్స్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ డిజైన్ కూడా ఉండవచ్చు.
ధర –
Vivo V40 ఇండియా ధర రూ. 20,000 నుంచి రూ. 25,000 మధ్య ఉండొచ్చు. Vivo V50 ధర కొన్ని వేరియంట్లలో రూ.25,000 నుండి రూ.30,000 మధ్య ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.
Vivo V50లో లేటెస్ట్, పవర్‌ఫుల్, అధునాతన ఫీచర్లు ఉండే అవకాశముంది. కొత్త ప్రాసెసర్, బెస్ట్ కెమెరా, లార్జ్ స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ Vivo V50ను Vivo V40 కంటే మరింతగా ఆకట్టుకునేలా చేసే ఛాన్స్ ఉంది.
ALSO READ : యాపిల్ యూజర్స్ కు పండగే.. ఇకపై ఐఫోన్ కు విండోస్ 11 సపోర్ట్