Vivo 200MP Price cut| వాటర్ ప్రూఫ్ ఫీచర్స్, సూపర్ క్వాలిటీ కెమెరాగల ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో కొనాలనుకునేవారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. వివో X200 ప్రో (Vivo X200 Pro) ధర రూ.15,000 తగ్గింది. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ ధర రూ.94,999. ఇప్పుడు ఇదే ఫోన్ రూ.79,999కి దొరుకుతోంది. అమెజాన్ లో మాత్రమే ఈ ఆఫర్ ఉంది. బ్యాంక్ ఆఫర్లు, EMIలో కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్ లభిస్తుంది. EMIలో కొనేవారికి రూ.1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే గరిష్టంగా రూ.40,000 వరకు ఆదా అవుతుంది. ఈ ధర తగ్గింపు బలమైన పెర్ఫామెన్స్, టాప్ కెమెరాలు కావాలనుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వివో X200 ప్రోలో 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్‌తో షార్ప్ విజువల్స్ ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు ఉంటుంది. ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఫాస్ట్, స్థిరమైన పర్‌ఫామెన్స్ ఇస్తుంది. ఇందులో 16GB LPDDR5X RAM, 512GB UFS 4.0 స్టోరేజ్ ఉన్నాయి. యాప్స్ త్వరగా ఓపెన్ అవుతాయి, మల్టీటాస్కింగ్ సులభంగా జరుగుతుంది.
కెమెరా సెటప్ ఈ ఫోన్ హైలైట్. మూడు రియర్ కెమెరాలు ఉన్నాయి. 50MP మెయిన్ సెన్సార్ ఉంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా వైడ్ షాట్స్ తీసుకోవడానికి సహాయపడుతుంది. భారత్‌లో మొదటిసారి 200MP ZEISS APO టెలిఫోటో కెమెరా ఉంది. 3.7x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ప్రొఫెషనల్ లెవల్ కలర్ అక్యురసీ ఇస్తుంది. ZEISS ట్యూనింగ్ వల్ల అన్ని లైటింగ్ కండిషన్లలో మంచి ఇమేజ్ క్వాలిటీ వస్తుంది. ముందు 32MP కెమెరా ఉంది. సెల్ఫీలు, 4K వీడియో రికార్డింగ్ స్పష్టంగా వస్తాయి.
6000mAh పెద్ద బ్యాటరీ ఉంది. రోజంతా సులభంగా సరిపోతుంది. హెవీ యూజర్లకు కూడా బాగా బ్యాకప్ ఇస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. త్వరగా ఛార్జ్ అవుతుంది. 30W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. దుమ్ము, నీటి నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది.
Also Read: కాలింగ్, గేమింగ్, ఫిట్‌నెస్ కోసం బాయ్స్ స్మార్ట్ వాచెస్.. 2026లో బెస్ట్ ఇవే
ఆండ్రాయిడ్ 15తో Funtouch OS 15 ఇంటర్‌ఫేస్ ఉంది. స్మార్ట్ AI ఫీచర్లు ఉన్నాయి. లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, AI నోట్ అసిస్టెంట్ వంటివి ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 5G, Wi-Fi 6, బ్లూటూత్, NFC సపోర్ట్ చేస్తుంది.
ఈ ధర తగ్గింపు తర్వాత వివో X200 ప్రో మరింత వాల్యూ ఫర్ మనీ అయింది. ప్రీమియం ఫోన్‌ను తక్కువ ధరలో కొనవచ్చు. బలమైన హార్డ్‌వేర్, అడ్వాన్స్‌డ్ ZEISS కెమెరా, పెద్ద బ్యాటరీ, బ్రైట్ డిస్‌ప్లే ఉన్నాయి. ముఖ్యంగా 200MP ZEISS కెమెరా ఫోటోగ్రఫీ లవర్లకు ఆకర్షణీయంగా ఉంటుంది. పెర్ఫామెన్స్, డ్యూరబిలిటీ.. రెండూ కావాలనుకునేవారికి ఈ డీల్ సూపర్ ఆప్షన్.