E-Paper
Advertisement

Bengaluru Crime: వంటలో అత్తతో చిచ్చు.. టెక్కీ కోడలు సూసైడ్, బెంగుళూరులో దారుణం

Bengaluru Crime: వంటలో అత్తతో చిచ్చు.. టెక్కీ కోడలు సూసైడ్, బెంగుళూరులో దారుణం
Advertisement

Bengaluru Crime: ఫ్యామిలీలో చిన్న చిన్న విషయాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఫలితంగా ఊహించని నిర్ణయాలు తీసుకున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా వంట విషయంలో అత్త-కోడలు మధ్య గొడవ జరిగింది. దీన్ని అవమానంగా భావించిన మాజీ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడింది. సంచలనం రేపిన ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది.

బెంగుళూరులో దారుణం.. వంట వ్యవహారంలో చిచ్చు

Advertisement

సిలికాన్‌ సిటీ బెంగళూరులో దారుణమైన ఘటన జరిగింది. టెక్‌ కంపెనీ మాజీ టెక్కీ సుష్మ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు ఐదేళ్ల కిందట పునీత్ కుమార్‌తో సుష్మ పెళ్లి జరిగింది. సుష్మ తొలుత టెక్కీగా పని చేసేది. ఆ తర్వాత ఉద్యోగానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దంపతులు బెంగళూరులో నివాసం ఉంటున్నారు.

ఈ జంటకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పునీత్‌ కుమార్‌ దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి. ఒకరు అవునంటే.. మరొకరు నో అనేవారు. చివరకు దంపతుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇదే క్రమంలో మంగళవారం సుష్మ- ఆమె అత్త కల్పన మధ్య వంట విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. తనను వంట చేసేందుకు ఆమె అత్త అనుమతించలేదు.

Advertisement

అత్త వేధింపులు భరించలేక టెక్కీ కోడలు సూసైడ్

అంతేకాదు చిన్న విషయాల్లో తనను వేధిస్తుందంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఫలితంగా ఇంట్లోనే ఉరేసుకుంది. కూతురు మృతి వార్త తెలియగానే తల్లిదండ్రులకు అక్కడికి చేరుకున్నారు. జరిగిన తీరుని అల్లుడి నుంచి అడిగి తెలుసుకున్నారు. అత్తింటి వేధింపులకు తట్టుకోలేక మా కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు సుష్మ తల్లిదండ్రులు.

వారిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సుష్మ భర్త పునీత్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత ఆమె అత్త పరారీలో ఉంది. ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు పోలీసులు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఇంజనీర్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడంతో ఉన్నత కుటుంబాల్లో అంతర్గత కలహాలు, మానసిక ఒత్తిడి వంటి సమస్య మరోసారి తెరపైకి వచ్చాయి.

ALSO READ: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×