E-Paper
Advertisement

Scientists:- బ్లాక్ హోల్ చుట్టూ వింత ఆకారాలు.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

Scientists:- బ్లాక్ హోల్ చుట్టూ వింత ఆకారాలు.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..
Advertisement

Scientists:- ఒకప్పుడు అంతరిక్షంపై పరిశోధనలు చేయడానికి కష్టపడిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు అన్నీ ఈజీగా చేసేస్తున్నారు. దానికి టెక్నాలజీ కూడా ఎంతో సాయం చేస్తోంది. అందుకే ఒకప్పుడు మిస్టరీ అనుకున్న విషయాలను కూడా శోధించడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అవుతున్నారు. అందులో ఒకటి బ్లాక్ హోల్స్. తాజాగా అతిపెద్ద బ్లాక్ హోల్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు.. దానిపై మరిన్ని పరిశోధనలు చేయడంతో పాటు దాని చుట్టూ పరిస్థితులను కూడా గుర్తించారు.

ఎంతోకాలంగా బ్లాక్ హోల్స్ గురించి శాస్త్రవేత్తలకు అవగాహన ఉన్నా.. దాని స్పష్టమైన ఇమేజెస్ మాత్రం ఇటీవల బయటికి వచ్చాయి. ఇమేజెస్‌ కోసం కష్టపడిన శాస్త్రవేత్తలు.. దాని ద్వారా మరికొంత సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. బ్లాక్ హోల్స్ చుట్టూ లైటింగ్ వల్ల వింత వింత ఆకారాలను కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతే కాకుండా బ్లాక్ హోల్స్ నుండి ఇతర హై ఎనర్జీ పార్టికల్స్ కూడా స్పేస్ నుండి బయటికి దూసుకొస్తున్నాయని గమనిస్తున్నారు.

Advertisement

తాజాగా భూమిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న 16 టెలిస్కోప్స్‌తో బ్లాక్ హోల్ ఇమేజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీయగలిగారు శాస్త్రవేత్తలు. మెస్సియర్ 87 లేదా ఎమ్ 87 లాంటి గ్యాలక్సీ దగ్గర ఈ బ్లాక్ హోల్ వారికి కనిపించింది. ఇది భూమి నుండి దాదాపు 54 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నట్టుగా వారు చెప్తున్నారు. మామూలుగా ఒక లైట్ ఇయర్ అనేది దాదాపు 5.9 ట్రిలియన్ మైల్స్ అంటే 9.5 ట్రిలియన్ కిలోమీటర్ల దూరం అని అర్థం. ఈ బ్లాక్ హోల్ అనేది సూర్యూడికంటే దాదాపు 6.5 బిలియన్ రెట్లు ఎక్కువ మాస్ కలిగిందని తెలిపారు.

చాలావరకు గ్యాలక్సీల చుట్టే ఈ అతిపెద్ద బ్లాక్ హోల్స్ అనేవి ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా బ్లాక్ హోల్స్ అనేవి ఒరిజినేట్ అయిన చోటునుండి చాలా దూరం ప్రయాణించగలవని అంటున్నారు. ఇటీవల విడుదలయిన బ్లాక్ హోల్ ఇమేజ‌లలో దాని చుట్టూ ఉండే రింగ్స్ కూడా స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు బ్లాక్ హోల్‌పై పరిశోధనలతో పాటు అది ఒరిజినేట్ అయిన ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు ఎలా ప్రయాణిస్తాయి అని కూడా తెలుసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

Related News

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

Big Stories

Advertisement
×