BigTV English

Crime News: తలను రెండు ముక్కలు చేసి.. భార్యను కిరాతకంగా చంపి.. భర్త సూసైడ్

Crime News: తలను రెండు ముక్కలు చేసి.. భార్యను కిరాతకంగా చంపి.. భర్త సూసైడ్

Crime News: వాడు మామూలు సైకో కాదు. సైకోలకే సైకో. మద్యానికి బానిసయ్యాడు. భర్తతో వేగలేక భార్య కువైట్ వెళ్లిపోయింది. కూతుర్లను తీవ్రంగా కొడుతూ టార్చర్ చేసి.. అది వీడియో తీసి.. భార్యకు పంపించి.. విదేశాల నుంచి రప్పించాడు. భార్య వచ్చాక.. తాను మారిపోయానని.. మంచిగా ఉంటానని మభ్యపెట్టి.. ఇంటికి తీసుకొచ్చి.. కిరాతకంగా చంపేశాడు. చంపడమంటే ఏదో క్షణికావేశంలో హత్య చేయడం కాదు. పగతో, కసితో రగిలిపోయి.. దారుణంగా చంపాడు. మెడ, చేయి కోసేశాడు. ఓ చేతిని నరికి.. మరో చేతిలో పెట్టాడు. తలను రెండు ముక్కలు చేసి అత్యంత క్రూరంగా హతమార్చాడు ఆ ఉన్మాది. మృతురాలి చేయిని నరికి ఆమె మరో చేతిలో పెట్టి పైశాచికత్వం ప్రదర్శించాడు.


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో జరిగిందీ దారుణం. గ్రామానికి చెందిన దావీదు కొంతకాలంగా భార్య నిర్మలతో గొడవలు పడుతున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పుట్టింట్లో ఉంటున్న భార్యను మూడ్రోజుల క్రితం సొంతూరికి తీసుకొచ్చాడు దావీదు. గురువారం రాత్రి మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఘర్షణ ముదిరి భార్యపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు.

గతంలోనూ నిర్మలను దావీదు అనేక రకాలుగా హింసించినట్లు పోలీసులు తెలిపారు. నిర్మల ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లగా.. ఆ సమయంలో డబ్బులు పంపించాలంటూ దావీదు ఇబ్బందులు పెట్టేవాడని పోలీసులు అంటున్నారు. కుమార్తెలను చిత్రహింసలు పెడుతూ వీడియోలు నిర్మలకు పంపించేవాడని చెప్పారు. కూతుర్లను చంపేస్తానని బెదిరించి.. డబ్బులు పంపించాలని బెదిరించేవాడని చెప్పారు. ఆ వీడియో స్థానిక సోషల్ గ్రూపుల్లో వైరల్‌ కావడంతో తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీసులు దావీదును అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత నిర్మల కువైట్‌ నుంచి వచ్చి పుట్టింట్లో ఉంటోంది.


రెండు నెలల క్రితం జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన దావీదు.. తాను మారిపోయానంటూ భార్యను నమ్మించాడు. మూడు రోజుల క్రితం భార్యను బతిమిలాడి మరీ వీరంపాలెంలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. గురువారం రాత్రి భార్యాభర్తలకు మళ్లీ గొడవ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున భార్య నిద్రలో ఉండగా.. నిర్మల మెడ, చేయి కోసి.. తలను రెండు ముక్కలు చేసి క్రూరంగా హతమార్చాడు. నిందితుడు దావీదును పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×