E-Paper
Advertisement

చాలా మంది చేస్తున్న పొరపాటు! రాత్రివేళ మీ Wi-Fi రూటర్ ఆన్‌లో ఉంచుతున్నారా ? జాగ్రత్త

చాలా మంది చేస్తున్న పొరపాటు! రాత్రివేళ మీ Wi-Fi రూటర్ ఆన్‌లో ఉంచుతున్నారా ? జాగ్రత్త
Advertisement

Wi-Fi Router: నేటి డిజిటల్ యుగంలో.. ఇంటర్నెట్ లేనిదే క్షణం గడవదు. స్మార్ట్‌ఫోన్ల నుంచి టీవీల వరకు అన్నీ.. Wi-Fi తోనే కనెక్ట్ అయి ఉన్నాయి. అయితే.. చాలా మందిని వేధిస్తున్న ఒకే ఒక సందేహం. రాత్రి పడుకునే ముందు Wi-Fi రూటర్‌ను ఆఫ్ చేయాలా?” కొందరు కరెంట్ ఆదా అవుతుందని, మరికొందరు ఆరోగ్యం కోసం ఆఫ్ చేస్తారు. అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారు? రాత్రిపూట రూటర్ ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభనష్టాలేంటి? మీ వైఫై స్పీడ్ పెరగాలంటే మీరు చేయాల్సిన పనులేంటో.. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రాత్రిపూట Wi-Fi ఆఫ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. కరెంట్ ఆదా: 
ఒక రూటర్ తక్కువ కరెంట్ తీసుకున్నప్పటికీ.. ఏడాది పొడవునా 24/7 ఆన్ చేసి ఉంచడం వల్ల మీ కరెంట్ బిల్లుపై ప్రభావం పడుతుంది. రాత్రి 7-8 గంటల పాటు ఆఫ్ చేయడం వల్ల నెలకు కొంత మొత్తాన్ని ఆదా చేయవచ్చు.

Advertisement

2. సైబర్ సెక్యూరిటీ:
మీ రూటర్ ఆఫ్ లో ఉంటే.. హ్యాకర్లు మీ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించే అవకాశం సున్నా. రాత్రి వేళల్లో హ్యాకింగ్ ప్రయత్నాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఆఫ్ చేయడం వల్ల మీ డేటా సేఫ్‌గా ఉంటుంది.

3. రూటర్ లైఫ్ పెరుగుతుంది:
ఏ ఎలక్ట్రానిక్ పరికరానికైనా విశ్రాంతి అవసరం. ఎప్పుడూ ఆన్‌లో ఉండటం వల్ల రూటర్ లోపల వేడి పెరుగుతుంది. రాత్రి పూట ఆఫ్ చేయడం.. వల్ల హార్డ్‌వేర్ చల్లబడుతుంది.

Advertisement

4. ప్రశాంతమైన నిద్ర:
వైఫై రూటర్ నుంచి వెలువడే రేడియేషన్ మన నిద్రపై ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. రూటర్ ఆఫ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరిగి, గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంది.

ఆఫ్ చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవే:
ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్: చాలా రూటర్లు రాత్రి పూట ఆటోమేటిక్ అప్‌డేట్స్ తీసుకుంటాయి. ఆఫ్ చేస్తే.. అవి ఆగిపోయి సెక్యూరిటీ సమస్యలు రావచ్చు.

స్మార్ట్ హోమ్ డివైజెస్: మీ ఇంట్లో స్మార్ట్ కెమెరాలు లేదా అలారమ్ సిస్టమ్స్ ఉంటే.. వైఫై ఆఫ్ చేయగానే అవి పని చేయడం మానేస్తాయి.

కనెక్టివిటీ ఇష్యూస్: ప్రతి రోజూ ఆఫ్ చేసి ఆన్ చేయడం వల్ల కొన్నిసార్లు IP అడ్రస్ రీసెట్ అయి మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి సమయం పట్టొచ్చు.

నిపుణుల సూచనలు:
మీరు స్మార్ట్ హోమ్ పరికరాలు వాడకపోతే.. రాత్రి పూట రూటర్ ఆఫ్ చేయడం మంచిదే. ఒక వేళ ప్రతిరోజూ బటన్ నొక్కడం ఇబ్బందిగా అనిపిస్తే.. మార్కెట్లో దొరికే ‘Digital Timers’ వాడండి. ఇవి మీరు సెట్ చేసిన సమయానికి.. ఆటోమేటిక్‌గా వైఫైని ఆఫ్ చేసి, ఉదయాన్నే ఆన్ చేస్తాయి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×