Bigg Boss: సినిమా అంటేనే వినోద భరిత రంగుల ప్రపంచం.. ఇందులో కనిపించే ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రిటీనే. అందుకే వీరు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయమైనా సరే క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది.. అంతేకాదు వీరు ఒకరితో కలిసి తిరిగినా లేదా రెండు మూడు సినిమాలలో కలసి జంటగా కనిపించినా లేదా ఇతరులు పెట్టిన పోస్టులకు లైక్ కొట్టినా సరే ఆ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకుంటున్నాయి. ఆడ , మగ అయితే చాలు వాళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే వారి మధ్య ఎలాంటి బంధం ఉంది అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా.. ఎఫైర్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత రెండు సంవత్సరాలుగా ప్రముఖ క్రికెటర్ సిరాజ్ తో బిగ్ బాస్ ఫేమ్ మహిరా శర్మ డేటింగ్ చేస్తోంది అనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా నవంబర్ 2024 సమయం నుండే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత క్రికెటర్, హైదరాబాద్ ప్లేయర్ అయిన మహమ్మద్ సిరాజ్ ప్రేమ వార్తలు అభిమానులలో కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకుముందు లెజెండ్రీ గాయని ఆశాభోంస్లే మనవరాలు జనై భోంస్లే తో ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చాయి. అయితే వాటిని సిరాజ్ అప్పుడే ఖండించారు. ఆమె తనకు సోదరీ సమానం అంటూ స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ ఫేమ్ మహీరా శర్మతో సిరాజ్ డేటింగ్ లో ఉన్నాడు అంటూ కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా దగ్గర సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారని, పలు ఇంగ్లీష్ వెబ్ సైట్ లలో కూడా వచ్చింది. దీనికి కారణం మిహిరా చేసిన పోస్ట్ కి ఇన్స్టాగ్రామ్ లో సిరాజ్ లైక్ కొట్టడమే.. పైగా ఆమెను ఫాలో కూడా అయ్యారు.
దీంతో రూమర్స్ దావాణంలా పాకిపోయాయి. ఇక రూమర్స్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మహీరా శర్మ తల్లి సానియా శర్మ ఈ వార్తలపై స్పందించింది. వాటిని ఎవరు నమ్మకండి అంటూ కోరింది . ఒక ఇంటర్వ్యూ సందర్భంగా జర్నలిస్టులు ఆమె వద్ద ఈ ప్రశ్నను తీసుకురాగా..” అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? బయట వాళ్ళు ఎన్నో అంటుంటారు.. ఇప్పుడు నా కుమార్తె ఒక సెలబ్రిటీ.. అందుకే ఫ్యాన్స్ ఆమెకు ఎవరితోనైనా సంబంధాలు కలిపేస్తారు. వాటన్నింటినీ మనం నమ్మాలా? అసలు అలాంటి వార్తలన్నీ కూడా తప్పే..” అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఈ వార్తలు ముగిసిపోతాయని అందరూ అనుకున్నారు . కానీ ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి కనిపించడంతో ఆ రూమర్స్ మరింత జోరుగా వినిపిస్తున్నాయి.
also read:శ్రీదేవి చివరి కోరిక తీర్చలేకపోయా.. డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్!
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల మరొకసారి అహ్మదాబాద్ లోని ఒక రెస్టారెంట్లో ఒకే దగ్గర కనిపించడమే ఇందుకు కారణం.. పైగా వీరిద్దరికీ సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . ఏది ఏమైనా గతంలో తాను ఎవరితో డేటింగ్ చేయట్లేదని స్పష్టం చేసినా.. అటు సిరాజ్ కూడా అందులో నిజం లేదని ఇన్స్టా స్టోరీ పెట్టి డిలీట్ చేసినా.. ఇప్పుడు మళ్లీ ఒకే దగ్గర కనిపించడంతో ఈ వార్తలు మరింత జోరందుకుంటున్నాయి. మరి ఇప్పుడేమంటారో చూడాలి.
సిరాజ్, మహీరా శర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. అహ్మదాబాద్‌లోని ఒకే రెస్టారెంట్ వద్ద వీరిద్దరూ కనిపించడంతో డేటింగ్ పుకార్లు షురూ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గతంలోనే ఇలాంటి వార్తలను మహీరా ఖండించారు. సిరాజ్ కూడా అప్పట్లో ఇన్‌స్టాలో… pic.twitter.com/Igt2besLsK
— ChotaNews App (@ChotaNewsApp) March 29, 2026