MP Etela Rajender: బాచుపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పరిశీలించారు. ఇక్కడ డంపింగ్ యార్డు, పార్క్ నిర్మాణం చేయాలని అన్నారు. ప్రభుత్వ స్కూలు, బస్తీ దవాఖాన, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలిని, RTC బస్సు లోపలికి వచ్చేలా చూడాలని అన్నారు. బాచుపల్లిలో మంచినీటి సమస్య ను పరిష్కారం చేయాలని అక్కడి డబుల్ బెడ్ రూమ్‌లో నివాసం ఉంటున్న ప్రజలు కోరారు.
రాష్ట్రలో తాగునీటి సమస్య ప్రతి దగ్గర ఉందని అన్నారు. ఇక్కడ ఇల్లలో 1100 కుటుంబాలు ఉన్నాయి. సుమారు 5 వేల జనాభా ఉంటుందని అన్నారు. ఒక్కొక్కరికి 135 లీటర్ల ఇవ్వాలని, ఆ లెక్కన చూస్తే 6.5 లక్షల లీటర్ల నీరు రావాలని, కానీ ఏ డబుల్ బెడ్ రూం కాలనీలో కూడా నీళ్లు రావడం లేదని ఈటల రాజేందర్ అన్నారు. అన్ని డబుల్ బెడ్ రూమ్ పైన వాటర్ ప్రూఫింగ్ చేయాలని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఆశ వర్కర్స్, అంగన్వాడీ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులకు అనుగుణంగా ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలని అన్నారు.
Also Read: Jeevan Reddy: కాక రేపుతున్న జగిత్యాల రాజకీయం.. 45 ఏళ్ల బంధానికి విద్వంసమే జీవన్ రెడ్డి అజెండానా..?
ఒక ఊరిలో ఎలా ఉంటాయో అలాగే అన్ని షాపులు ఇక్కడ ఏర్పాటు చేయాలని అన్నారు. దోమల నరకం నుండి బయటపడాలంటే పక్కన ఉన్న చెరువులో ఉన్న గుర్రపు డెక్క చెరువు అంత శుభ్రం చేయాలని డిమాండ్ చేసారు. శ్మశాన వాటిక, దేవాలయాల నిర్మాణం చేయాలని అన్నారు. మీరందరూ అన్నదమ్ములలాగా కుటుంబ సభ్యులలాగా కలిసి మెలిసి ఉండండని, నీటి సమస్య పరిష్కారం చేయడానికి వెంటనే బోర్లు వేయిస్తామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
Also read: Induction Stoves: అమెజాన్‌లో అత్యధికంగా.. సేల్ అవుతున్న ఇండక్షన్ స్టవ్స్.. ధర కూడా తక్కువే!