E-Paper
Advertisement

ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు పెరుగుతుందా? ఈ లాజిక్ తెలిస్తే వద్దన్నా రెండూ వాడుతారు!

ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు పెరుగుతుందా? ఈ లాజిక్ తెలిస్తే వద్దన్నా రెండూ వాడుతారు!
Advertisement

Power Saving Tips: ఈసారి సమ్మర్ కాస్త ముందస్తుగానే మొదలవ్వడంతో.. ఉక్కపోతకు ఇంట్లో ఉండాలంటేనే జనాలు అల్లాడిపోతున్నారు. అయితే ఈ వేడిని తట్టుకోవడానికి ఏసీని ఎక్కువగా వాడుతుంటాం. ఈ క్రమంలో చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే.. ఏసీ వేసినప్పుడు ఫ్యాన్ కూడా వేయాలా? వద్దా? అని. కొందరేమో ఫ్యాన్ వేస్తే చల్లదనం తగ్గిపోతుందని అంటుంటే, మరికొందరేమో రెండు వాడితే కరెంట్ బిల్లు తడిసి మోపెడవుతుందని భయపడతారు. ఇంతకీ ఏసీ, ఫ్యాన్ కలిపి వాడటం లాభమేనా లేక నష్టమా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రెండూ ఒకేసారి వాడొచ్చా?

సాధారణంగా మనం ఏసీ ఆన్ చేసినప్పుడు అది గదిలో ఉండే వేడిని లాగేసుకుని, చల్లటి గాలిని ఒకే దిశలో బయటకు వదులుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే.. ఏసీకి ఎదురుగా కూర్చున్న వారికి మాత్రమే వెంటనే చల్లగా అనిపిస్తుంది. కానీ గదిలోని మూలలకు ఆ చల్లదనం చేరడానికి చాలా టైం పడుతుంది. అదే సమయంలో మనం ఫ్యాన్ కూడా ఆన్ చేస్తే, అది ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలిని గదిలోని నలుమూలలకు సమానంగా పంచుతుంది. దీనివల్ల గది త్వరగా చల్లబడి మనకు హాయిగా అనిపిస్తుంది.

Advertisement

Also Read: బెడ్ దిగక్కర్లేదు.. రిమోట్‌తో ఫ్యాన్ వేయొచ్చు.. తక్కువ ధరలో లభించే టాప్-5 మోడల్స్ ఇవే!

కరెంట్ బిల్లును ఇలా తగ్గించండి..

చాలామంది ఏసీతో పాటు ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లు పెరుగుతుందని అనుకుంటారు. కానీ ఈ రెండూ కలిపి వాడటం వల్ల మనకు డబ్బులు ఆదా అవుతాయి. ఫ్యాన్ తిరగడం వల్ల గాలిలో కదలికలు ఏర్పడి మన శరీరానికి త్వరగా చల్లదనం అందుతుంది. దీనివల్ల మనం ఏసీ టెంపరేచర్‌ను 24 లేదా 26 డిగ్రీల దగ్గర పెట్టినా కూడా, మనకు 20 డిగ్రీల దగ్గర ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఏసీలో ప్రతి ఒక్క డిగ్రీ పెంచడం వల్ల దాదాపు 6 శాతం విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఏసీ కంప్రెషర్‌పై లోడ్ తగ్గి అది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు..

Advertisement

అయితే ఏసీతో పాటు ఫ్యాన్ వాడేటప్పుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్యాన్ స్పీడ్‌ను మరీ ఫుల్‌గా కాకుండా మీడియం లెవల్‌లో ఉంచితే మంచిది. ఎందుకంటే ఫ్యాన్ మరీ వేగంగా తిరిగితే గదిలో ఉండే తేమను లాగేసి చర్మం పొడిబారేలా చేస్తుంది. అలాగే ఏసీ రూమ్‌లో గాలి బయటకు వెళ్లకుండా కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే తక్కువ ఖర్చుతోనే మన ఇల్లు చల్లని కాశ్మీర్‌లా మారిపోతుంది.

ప్రశాంతమైన నిద్ర కోసం..

రాత్రిపూట పడుకునేటప్పుడు ఏసీ టెంపరేచర్‌ను కొంచెం పెంచి, ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టుకుంటే ఒళ్లు నొప్పులు రాకుండా ఉంటాయి. ఇది గదిలో సహజమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి.. హాయిగా నిద్ర పడుతుంది. కేవలం ఏసీ మీదనే ఆధారపడకుండా ఇలా ఫ్యాన్ సాయం తీసుకోవడం వల్ల కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది. కాబట్టి ఇక మీదట ఎవరైనా ఏసీతో పాటు ఫ్యాన్ వద్దు అని వాదిస్తే, వాళ్లకు ఈ ముచ్చట చెప్పి మరీ ఫ్యాన్ వేయండి.

Also Read: హాలీవుడ్ రేంజ్ సెటప్ ఇక ఇంట్లోనే.. ఈ చిన్న మ్యాజిక్ లైట్‌తో బెడ్‌రూమ్ లుక్కే మారిపోద్ది!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×