Ranbir Kapoor: రణబీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. మరొక రెండు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తికాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు నేటిజన్ లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)శ్రీరాముడి(Lord Srirama) పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం రణబీర్ కపూర్ కొన్ని నియమాలను పాటిస్తూ కొన్ని అలవాట్లను కూడా దూరం పెట్టారని తెలుస్తోంది.
రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఈయన స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లను పూర్తిగా పక్కన పెట్టేసారని తెలియజేశారు. తాను ఎక్కువ సమయం తన కూతురితో గడపడానికి అలాగే యోగ వంటివి చేయడానికి ఇష్టపడుతున్నానని రణబీర్ కపూర్ తెలిపారు. మరొక రెండు నెలలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని ఈ సందర్భంగా రణబీర్ కపూర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా ఈయన సినిమా కోసం స్మోకింగ్, డ్రింకింగ్ పక్కన పెట్టేసానని చెప్పడంతో పలువురు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే సిగరెట్ ఆల్కహాల్ తీసుకోవడం మానేశారా ?లేకుంటే పూర్తిగా మానేశారా? అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం చాలా అద్భుతంగా నటిస్తున్నారు అంటూ పలువురు విమర్శలు కూడా కురిపిస్తున్నారు. ఈయన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో నటించబోతున్నారనే విషయం ప్రకటించడంతో ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే బీఫ్ తినే వ్యక్తి రాముడిగా నటించడం ఏంటి అంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి.
నితీష్ తివారి కంటే కూడా ఓం రౌత్ బెటర్
ఇక రణబీర్ కపూర్ రాముడిగా నటించిన గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఖండించారు రాముడు అంటే ప్రశాంతతకు మారుపేరు అలాంటి ప్రశాంతత రణబీర్ లో కనిపిస్తుందని అందుకే తనని ఎంపిక చేసామంటూ తెలియజేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా రణబీర్ రాముడి పాత్రలో ఎంతో అద్భుతంగా ఉన్నారు . అయితే కొంతమంది ఈయన లుక్ పట్ల కూడా విమర్శలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. నితీష్ తివారి కంటే కూడా ఓం రౌత్ బెటర్ రాముడిగా ప్రభాస్ ను అద్భుతంగా చూపించారు అంటూ ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు.
Ranbir Kapoor – "I have given up smoking, drinking and turned vegetarian for Lord Ram role."
True devotion on and off screen the Ramayana movie is set to rewrite the history of Indian cinema.🤍🫶🏻 pic.twitter.com/hmHffeNCwV
— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) April 2, 2026
Also Read: రణబీర్ కపూర్ రామాయణ సినిమాలో కాజల్ అగర్వాల్..కన్ఫర్మ్ చేసిన నటి