E-Paper
Advertisement

కరెంట్ బిల్లు తక్కువ.. కూలింగ్ ఎక్కువ! బెడ్‌రూమ్‌ని కాశ్మీర్ చేసే లేటెస్ట్ ఏసీలు!

కరెంట్ బిల్లు తక్కువ.. కూలింగ్ ఎక్కువ! బెడ్‌రూమ్‌ని కాశ్మీర్ చేసే లేటెస్ట్ ఏసీలు!

Best silent AC for bedroom: రోజంతా ఆఫీస్ పనులు, ఒత్తిడితో అలసిపోయి రాత్రి ఇంటికి వచ్చాక బెడ్‌రూమ్‌లో ప్రశాంతమైన నిద్రను కోరుకుంటాం. కానీ.. ఏసీ నుంచి వచ్చే ‘ఘర ఘర’ శబ్దం ఆ నిద్రను పాడు చేస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో కదా! అందుకే ఇప్పుడు మార్కెట్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది, అదే “Silent 1.5 Inverter AC”. ఇవి కేవలం గదిని చల్లబరచడమే కాదు.. అసలు ఏసీ ఆన్ లో ఉందా లేదా అనేంత సైలెంట్‌గా పని చేస్తాయి. మీ బెడ్‌రూమ్ కూలింగ్ నీడ్స్‌కు ఇవి ఎందుకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఓ ఇప్పుడు తెలుసుకుందాం.

సైలెంట్ 1.5 ఇన్వర్టర్ ఏసీలు – బెడ్‌రూమ్ కూలింగ్ సొల్యూషన్స్ :

1. సూపర్ సైలెంట్ ఆపరేషన్ :
సాధారణ ఏసీలు రన్ అవుతున్నప్పుడు కంప్రెసర్ వల్ల పెద్దగా శబ్దం వస్తుంది. కానీ లేటెస్ట్ ఇన్వర్టర్ ఏసీలలో ‘ట్విన్ రోటరీ కంప్రెసర్’ వాడుతున్నారు. దీని వల్ల ఇండోర్ యూనిట్ శబ్దం కేవలం 19 నుంచి 25 డెసిబెల్స్ (dB) మాత్రమే ఉంటుంది. అంటే కేవలం ఆకులు కదిలినప్పుడు వచ్చే శబ్దమన్నమాట. దీని వల్ల బెడ్‌రూమ్‌లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్రపోవచ్చు.

2. ఇన్వర్టర్ టెక్నాలజీతో కరెంట్ బిల్లు సేవింగ్స్:
బెడ్‌రూమ్‌లో ఏసీని రాత్రంతా (కనీసం 7 నుంచి 8 గంటలు) ఆన్ చేసి ఉంచుతాం. పాత మోడల్స్ అయితే కరెంట్ బిల్లు చూసి గుండె గుభేల్ అనాల్సిందే. కానీ ఇన్వర్టర్ ఏసీలు రూమ్ టెంపరేచర్‌ను బట్టి కంప్రెసర్ స్పీడ్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటాయి. దీని వల్ల కరెంట్ కన్సప్షన్ దాదాపు 30% నుంచి 40% వరకు తగ్గుతుంది. ముఖ్యంగా 4-స్టార్ లేదా 5-స్టార్ రేటింగ్ ఉన్న 1.5 టన్ ఏసీలు తక్కువ ఖర్చుతో లభిస్తాయి.

3. స్మార్ట్ కూలింగ్ మోడ్స్ :
లేటెస్ట్ మోడల్స్ అన్నింటిలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూలింగ్ మోడ్స్ వస్తున్నాయి. మీరు నిద్రపోయేటప్పుడు మీ బాడీ టెంపరేచర్‌కు తగ్గట్టుగా ప్రతి గంటకూ ఒక డిగ్రీ చొప్పున టెంపరేచర్‌ను ఇవి అడ్జస్ట్ చేస్తాయి. దీనివల్ల అర్ధరాత్రి చలి వేసి లేచి, రిమోట్ కోసం వెతుక్కునే తిప్పలు తప్పుతాయి.

4.పియర్ ఎయిర్ క్వాలిటీ :
బెడ్‌రూమ్ అంటే కేవలం చల్లగా ఉండటమే కాదు, మనం పీల్చే గాలి కూడా క్లీన్‌గా ఉండాలి. ఈ సైలెంట్ ఏసీలలో అడ్వాన్స్‌డ్ PM 2.5 ఫిల్టర్లు, యాంటీ-వైరల్ కోటింగ్స్ వస్తున్నాయి. ఇవి గదిలోని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాను ఫిల్టర్ చేసి, మీకు ప్యూర్ అండ్ హెల్తీ ఎయిర్‌ను అందిస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్లకు ఇవి చాలా సేఫ్.

5. 1.5 టన్ కెపాసిటీ ఎందుకు బెస్ట్?
మన ఇళ్లలో బెడ్‌రూమ్స్ సైజ్ సాధారణంగా 110 నుంచి 150 చదరపు అడుగుల మధ్యలో ఉంటుంది. ఈ సైజు గదులకు 1.5 టన్ ఏసీ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది చాలా వేగంగా రూమ్‌ను చల్లబరుస్తుంది. అలాగే కంప్రెసర్‌పై ఎక్కువ లోడ్ పడకుండా చూసుకుంటుంది.

మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ బ్రాండ్స్ :
డైకిన్ (Daikin 1.5 Ton 5 Star Inverter AC): సైలెంట్ ఆపరేషన్‌లో దీనికి తిరుగులేదు. దీని ధర సుమారు రూ. 48,000 వరకు ఉంటుంది.

పానాసోనిక్ (Panasonic 1.5 Ton Wi-Fi AC): స్మార్ట్ యాప్ కంట్రోల్ , మిరాంఎ ప్లాట్‌ఫామ్‌తో వస్తుంది. ధర సుమారు రూ. 46,000.

ఎల్జీ (LG 1.5 Ton AI DUAL Inverter AC): ఇది సూపర్ సైలెంట్, వేరియబుల్ కూలింగ్ ఆప్షన్లతో వస్తుంది. ధర సుమారు రూ.45,000 ఉంటుంది.

Also Read: మిక్సీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫాస్ట్ మోడల్స్ పై ఓ లుక్కేయండి!

బెడ్‌రూమ్ కోసం ఏసీ కొనేటప్పుడు కేవలం బ్రాండ్ మాత్రమే కాదు, దాని ‘Noise Level’ ఎన్ని డెసిబెల్స్ ఉందో స్పెసిఫికేషన్స్ షీట్‌లో కచ్చితంగా చెక్ చేయండి. 25 dB లోపు ఉంటేనే అది పర్ఫెక్ట్ సైలెంట్ ఏసీ. అలాగే 100% కాపర్ కండెన్సర్, యాంటీ-కొరోసివ్ కోటింగ్ (బ్లూ ఫ్రిన్స్/గోల్డ్ ఫిన్స్) ఉన్న మోడల్స్ ఎంచుకుంటే ఏసీ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. అంతే కాకుండా గ్యాస్ లీకేజీ సమస్యలు ఉండవు.

సౌండ్ లేని ప్రశాంతమైన వాతావరణం, తక్కువ కరెంట్ బిల్లు, హెల్తీ ఎయిర్.. ఇవే ఈ తరం బెడ్‌రూమ్ కూలింగ్ సొల్యూషన్స్. ఈ ఫీచర్స్ అన్నీ కావాలనుకుంటే ఒక మంచి Silent 1.5 Inverter AC లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ డెసిషన్. హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మీ బడ్జెట్‌కు సరిపోయే లేటెస్ట్ ఏసీని ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి.

Related News

ఎలక్ట్రీషియన్ అవసరం లేదు.. ఇంట్లోనే ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయండిలా !

పాత ఫ్యాన్ మార్చే టైమ్ వచ్చేసింది! కరెంట్ బిల్లును 65% తగ్గించే ఫ్యాన్స్!

మిక్సీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫాస్ట్ మోడల్స్ పై ఓ లుక్కేయండి!

రూ.8,999 నుంచే స్మార్ట్‌‌ఫోన్లు.. Amazon Saleలో ఏఐ ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్లు!

యూజర్లకు షాకిచ్చిన షియోమీ.. భారత్‌లో పెరిగిన Xiaomi Pad 8 ధరలు, కొత్త రేట్లు ఇవే!

బస్ స్టాప్‌లలో ఇక ఏసీ ఫీలింగ్.. సరికొత్త టెర్రాకోట టెక్నాలజీ వచ్చిందోచ్!

డేగ కళ్లతో రక్షణ కల్పించే AI కెమెరాలు.. మనుషులు, వాహనాలను ఇట్టే గుర్తించే స్మార్ట్ టెక్నాలజీ!

Big Stories

×