E-Paper
Advertisement

E85 ఫ్యూయల్ వచ్చేసింది.. పెట్రోల్ కంటే చీప్.. కానీ ఓ ట్విస్ట్ ఉందండోయ్!

E85 ఫ్యూయల్ వచ్చేసింది.. పెట్రోల్ కంటే చీప్.. కానీ ఓ ట్విస్ట్ ఉందండోయ్!
Advertisement

E85 Fuel Explained: దేశంలో E85 ఫ్యూయల్ అందుబాటులోకి రావడంతో ఇథనాల్ ఆధారిత ఇంధనాల వినియోగం మరో అడుగు ముందుకు వేసింది. ఢిల్లీలో లీటరుకు రూ.82.12 ధరతో ఈ ఇంధన అమ్మకాలను ప్రారంభించారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలతో పోలిస్తే చౌకగా ఉండటంతో వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఈ ఇంధనంతో లాభాలతో పాటు కొన్ని ప్రతికూల విషయాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందా..

ఇంతకీ ఏంటీ E85 ఫ్యూయల్?

E85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్న E20 ఇంధనంలో 20 శాతం మాత్రమే ఇథనాల్ ఉంటుంది. అందువల్ల E85 పూర్తిగా భిన్నమైన ఇంధనంగా చెప్పవచ్చు.  ఈ ఇంధనాన్ని సాధారణ పెట్రోల్ కార్లకు ఉపయోగించే అవకాశం లేదు. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు మాత్రమే  సురక్షితంగా నడుస్తాయి. ఇథనాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్ ప్రత్యేకంగా రూపొందించబడి ఉండాలి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఉన్న చాలా పెట్రోల్ కార్లు E20 వరకు మాత్రమే మద్దతు ఇస్తాయి.

సాధారణ కారులో E85 ఫ్యూయల్ పోస్తే?

Advertisement

సాధారణ పెట్రోల్ కారులో E85 ఇంధనాన్ని ఉపయోగిస్తే ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో మెకానికల్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే, వాహన తయారీ సంస్థ అనుమతి లేకుండా ఈ ఇంధనాన్ని వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.  ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మాత్రం పెట్రోల్ నుంచి E85 వరకు వివిధ ఇథనాల్ మిశ్రమాలపై నడిచేలా రూపొందించబడతాయి. ఇలాంటి వాహనాలు ఇంధనానికి అనుగుణంగా ఇంజిన్ పనితీరును ఆటోమేటిక్ గా సర్దుబాటు చేసుకుంటాయి. గత కొన్నేళ్లుగా కొన్ని కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను ప్రదర్శించాయి. వాటిలో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్ ఒకటి.

మైలేజీ ఎంత వస్తుందంటే?  

ధర పరంగా చూస్తే E85 పెట్రోల్ కంటే చౌకగా కనిపిస్తుంది. అయితే, మైలేజీ విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. పెట్రోల్‌ తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల E85పై నడిచే వాహనాలు అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. E85 వాడే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల్లో ఇంధన సామర్థ్యం 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే, లీటరు ధర తక్కువగా ఉన్నా, మైలేజీ తగ్గడం వల్ల మొత్తం ప్రయాణ ఖర్చు అంతగా తగ్గకపోవచ్చు.

Advertisement

అయితే E85 లక్ష్యం కేవలం వాహనదారుల ఖర్చు తగ్గించడం మాత్రమే కాదు. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం, కాలుష్య ఉద్గారాలను తగ్గించడం లాంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం E85 ఇంధనం పరిమిత ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. భవిష్యత్తులో ఈ వాహనాలు, ఫ్యూయల్ పంప్స్ మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also: EVలకు మారిన బాలీవుడ్ స్టార్లు.. ఏ హీరో దగ్గర ఏ ఎలక్ట్రిక్ కారు ఉందో తెలుసా?

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×