E-Paper
Advertisement

అధునాతన స్మార్ట్ కూలర్లు.. ఏసీలకు ప్రత్యామ్నాయం కాగలవా? నిపుణులు ఏమంటున్నారు!

అధునాతన స్మార్ట్ కూలర్లు.. ఏసీలకు ప్రత్యామ్నాయం కాగలవా? నిపుణులు ఏమంటున్నారు!
Advertisement

Smart Coolers vs AC: ఎండల తీవ్రత దృష్ట్యా చాలా మంది ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కూలర్లు చాలా స్మార్ట్ గా మారిపోయాయి. ఒకప్పుడు ఏసీల్లో ఉండే ఫీచర్లు.. ఇప్పుడు కూలర్లలోనూ దర్శనమిస్తున్నాయి. పవర్ ఫుల్ కూలింగ్ తో పాటు, విద్యుత్ ఆదా, టచ్ ప్యానెల్, రిమోట్ కంట్రోల్ వ్యవస్థలతో కూలర్లు వస్తున్నాయి. అయితే బేసిక్ లేదా సాధారణ ఏసీలకు అధునాతన సాంకేతికతతో వస్తున్న కూలర్లు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయా? అన్న సందేహం చాలా మందికి కలుగుతోంది. దీనిపై నిపుణుల అభిప్రాయం ఏవిధంగా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.

టచ్ ప్యానల్, రిమోట్ కంట్రోల్

పాత తరం కూలర్లు కేవలం బటన్స్, మ్యానువల్ ఆపరేటింగ్ వ్యవస్థలతో వచ్చేవి. కానీ ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ కూలర్లు.. టచ్ ప్యానెల్ తో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా రిమోట్ ద్వారా ఎక్కడి నుంచైనా వీటిని ఆపరేట్ చేసేందుకు వీలు కలుగుతోంది. కూలింగ్ సెట్టింగ్స్ మార్చుకోవడం, దూరం నుంచే ఆన్, ఆఫ్ చేసేందుకు అవకాశం లభిస్తోంది.

రియల్ టైమ్ టెంపరేచర్ డిస్‌ప్లే

Advertisement

గదిలోని ఉష్ణోగ్రత ఎంత ఉందో చూపే ఎల్‌ఈడీ డిస్‌ప్లే.. అధునాతన స్మార్ట్ కూలర్లలో ఉంటున్నాయి. ‘ఫౌంటెన్ వాటర్ సర్క్యులేషన్’, ‘హనీకాంబ్ ప్యాడ్స్’ వంటి సాంకేతికతతో గతంతో పోలిస్తే ఇవి గాలిని అత్యంత వేగంగా చల్లబరుస్తున్నాయి. స్లీప్ టైమర్, తక్కువ నీరు ఉన్నప్పుడు అలర్ట్ ఇవ్వడం. హ్యుమిడిటీ కంట్రోల్ వంటి ఏసీల్లో ఉండే స్మార్ట్ ఫీచర్లు ప్రస్తుతం కూలర్లలోనూ కనిపిస్తున్నాయి.

తక్కువ విద్యుత్ ఖర్చు..

స్మార్ట్ ఫీచర్లతో పాటు తక్కువ విద్యుత్ ను ఖర్చు చేసే విధంగా ప్రస్తుతం స్మార్ట్ కూలర్లు ఉంటున్నాయి. అంతేకాకుండా ఇన్వర్టర్లపై కూడా పనిచేసే విధంగా వీటిలో కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. కాబట్టి ఉక్కపోత ఎక్కువగా ఉండే కాలాల్లో కూలర్లను నిరంతరాయంగా రన్నింగ్ లో ఉంచేందుకు అవకాశం ఏర్పడుతోంది. పైగా విద్యుత్ ను ఆదా చేసే టెక్నాలజీ వీటిలో ఉండటం వల్ల పవర్ బిల్లు ఎక్కువగా వస్తుందన్న కంగారు యూజర్లలో ఉండటం లేదు.

ఏసీకి ప్రత్యామ్నాయమా?

Advertisement

అధునాతన ఫీచర్లతో తక్కువ బడ్జెట్ లో లభిస్తున్న స్మార్ట్ కూలర్లను.. ప్రస్తుతం చాలా మంది ఏసీకి ప్రత్యామ్నయంగా భావిస్తున్నారు. ఏసీతో పోలిస్తే వీటి ధర దాదాపు రూ.5000 నుంచి రూ.15000 వరకూ తక్కువగా ఉంటోంది. వీటికి చక్రాలు ఉండటం వల్ల ఒక గది నుండి మరో గదికి సులభంగా మార్చుకోవచ్చు. ఏసీలా గోడకు రంధ్రాలు చేయాల్సిన పని లేకుండా జస్ట్ ప్లగ్ పెడితే చాలు. కాబట్టి మధ్యతరగతి ప్రజలకు స్మార్ట్ కూలర్లు.. ఏసీకి ప్రత్యామ్నయంగా మారుతున్నట్లు అర్థమవుతోంది.

Also Read: Fan Cleaning: ఫ్యాన్‌కు బాగా దుమ్ము పట్టిందా? నిచ్చెనతో పనిలేకుండా.. ఇలా ఈజీగా క్లీన్ చేయండి!

నిపుణులు ఏం చెబుతున్నారంటే?

స్మార్ట్ కూలర్ vs ఏసీ విషయంలో నిపుణుల అభిప్రాయం ఇందుకు భిన్నంగా ఉంటోంది. స్మార్ట్ కూలర్లు.. ఏసీ తరహా ఫీచర్లను అందించినప్పటికీ.. గదిలోని తేమను తగ్గించలేవని పేర్కొంటున్నారు. పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో కూలర్లు అద్భుతంగా పనిచేస్తాయి కానీ, తీరప్రాంతాల్లో (High Humidity) వీటి ప్రభావం ఏసీ స్థాయిలో ఉండకపోవచ్చని చెబుతున్నారు. చల్లదనం విషయంలోనూ కూలర్, ఏసీకి మధ్య స్పష్టమైన వ్యాత్యాసం ఉంటుందని తేల్చి చెబుతున్నారు. కాబట్టి ఆర్థిక స్తోమత ఉంటే.. కూలర్ కు ఏసీని కొనడమే ఉత్తమమని చెబుతున్నారు.

Also Read: సామాన్యుల బ్రాండ్.. వర్ల్‌పూల్ టాప్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్‌లు.. సమ్మర్‌కు బెస్ట్ ఛాయిస్ భయ్యా!

Related News

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

ఆన్‌లైన్ క్లాసులు, నోట్స్ కోసం తక్కువ ధరలో బెస్ట్ ట్యాబ్‌లు

సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే! బడ్జెట్‌లో.. బెస్ట్ 4K డాల్బీ ఆడియో టీవీలు!

Big Stories

Advertisement
×