E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్యాండ్ మేళం..స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్యాండ్ మేళం..స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?
Advertisement

Band Melam OTT: కోర్టు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరో హీరోయిన్లుగా పరిచయమై మొదటి సినిమాతోనే సెన్సేషనల్ అందుకున్న హర్ష రోషన్(Harsha Roshan),శ్రీదేవి(Sridevi) తాజాగా బ్యాండ్ మేళం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న వీరిద్దరూ మరోసారి వెండితెరపై జంటగా సందడి చేశారు. సతీష్ జివ్వాజి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్యాండ్ మేళం సినిమా శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మార్చి 26వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే.

నెల తిరగకుండానే ఓటీటీలోకి..

ఎన్నో అంచనాల నడుమ శ్రీరామనవమి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడింది. ఈ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5(Zee 5) కైవసం చేసుకున్నారు. ఇక ఈ సినిమా మార్చి 26వ తేదీ థియేటర్లలో విడుదల కాగా నెల తిరగకుండానే ఏప్రిల్ 24వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది.

మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతున్నారు ..

Advertisement

ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని జీ 5 అధికారికంగా తెలియజేస్తూ బ్లాక్ బస్టర్ పెయిర్ ఈజ్ బ్యాక్.. మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతున్నారు అందుకు మీరు రెడీనా అంటూ బ్యాండ్ మేళం సినిమా ఏప్రిల్ 24వ తేదీ రాబోతుందని ప్రకటించారు. ఇలా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడంతో థియేటర్లలో అనుకున్న స్థాయిలో మెప్పించ లేకపోయినా ఈ సినిమా ఓటీటీలో నైనా. మోత మోగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కథ విషయానికి వస్తే..

Advertisement

యాదగిరి అలియాస్ గిరి (రోషన్), రాజీ (శ్రీదేవి) వరుసకు బావ మరదలు కావడంతో వీరిద్దరికీ పెళ్లి చేయాలని వాళ్ల చిన్నప్పుడే పెద్దలు నిశ్చయిస్తారు. కానీ వీళ్ళిద్దరూ పెరిగి పెద్దయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. గిరి మ్యూజిక్ అంటే ఎంతో ప్రాణం పెడతారు రాజీ మాత్రం చదువులలో టాపర్ గా ఉంటుంది. మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టమైనటువంటి గిరి తన స్నేహితులతో కలిసి ఊర్లో మ్యూజిక్ బ్యాండ్ పెడతారు. ఇక రాజీ మాత్రం ఉన్నది చదువుల కోసం పట్నం వెళ్తుంది. ఇక వీరిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నప్పుడు రాజీ తండ్రి సాయన్న (సాయికుమార్) అందుకు ఒకప్పుడు. చిన్నప్పటినుంచి రాజీ తనకు కాబోయే పెళ్ళామని కలలు కన్నా గిరి తన మరదలి కోసం ఏం చేశాడు? నిజంగానే రాజి వేరే వారిని పెళ్లి చేసుకుందా? లేక వీరిద్దరికి పెళ్లి జరిగిందా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read:  హైదరాబాద్ లో 5 కోట్ల విలువైన విల్లా కొన్న వదినమ్మ సీరియల్ నటి సుజిత?

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×