E-Paper
Advertisement

Smart Electric Cooker: ఇంటికెళ్లే సరికి వంట రెడీ చేసి పెట్టే ఎలక్ట్రిక్ కుక్కర్.. మొబైల్‌తో ఆపరేట్ చేస్తే చాలు!

Smart Electric Cooker: ఇంటికెళ్లే సరికి వంట రెడీ చేసి పెట్టే ఎలక్ట్రిక్ కుక్కర్.. మొబైల్‌తో ఆపరేట్ చేస్తే చాలు!
Advertisement

Smart Electric Cooker: తెల్లవారుజామునే లేచి, పిల్లల బాక్సులు సర్ది, హడావిడిగా ఆఫీసుకి బయలుదేరడం.. కంప్యూటర్ ముందు గంటల తరబడి శ్రమించి, అలసిపోయి ఇంటికి తిరిగి రావడం.. ఇది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దినచర్య. అయితే, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేసరికి వేడి వేడిగా ఎవరైనా వంట చేసి పెడితే ఎంత బాగుంటుంది కదా అని మనలో చాలామందికి అనిపిస్తుంటుంది.

అలాంటి వారి కోసమే ఇప్పుడొక స్మార్ట్ గ్యాడ్జెట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. దాని పేరు ‘స్మార్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్’. మీరు ఆఫీసు నుంచే మొబైల్ ఫోన్ ద్వారా ఈ కుక్కర్‌ను ఆపరేట్ చేయవచ్చు. తద్వారా మీరు ఇంటికి వచ్చేసరికి వంట రెడీగా ఉంటుంది. అదెలా అనే కదా మీ సందేహం? రండి.. ఈ కుక్కర్ కథేంటో తేలుద్దాం..

వై-ఫైతో పనిచేసే కుక్కర్:

Advertisement

సాధారణ ఎలక్ట్రిక్ కుక్కర్లకు, దీనికి చాలా తేడా ఉంది. ఈ స్మార్ట్ కుక్కర్ నేరు Wi-Fiకి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఆఫీసు నుంచి బయలుదేరేటప్పుడో లేదా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడో మీ స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌ను ఓపెన్ చేసి కుక్కర్‌ను ఆన్ చేయొచ్చు. ఉదయాన్నే కుక్కర్‌లో బియ్యం, నీళ్లు పోసి ఉంచితే సరిపోతుంది. మీకు కావలసిన సమయంలో ఫోన్ ద్వారా కమాండ్ ఇస్తే అది వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. మీరు ఇంట్లోకి అడుగు పెట్టేసరికి వేడి అన్నం వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది.

Also Read: వచ్చేసిందిరోయ్ JBL పోర్టబుల్ స్పీకర్.. AI సౌండ్ బూస్ట్‌తో బాక్స్ బద్దలైపోద్దిక!

వంట పూర్తవ్వగానే ఫోన్‌కు అలర్ట్:

Advertisement

ఈ గ్యాడ్జెట్‌లో కేవలం వంట చేయడమే కాకుండా, వంట పూర్తయ్యాక ఆ విషయాన్ని మీ మొబైల్ ఫోన్‌కు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఒకవేళ మీరు ఇంటికి వెళ్లడం ఆలస్యమైతే, Keep Warm ఫీచర్ ద్వారా అన్నం చల్లారిపోకుండా ఎక్కువ సేపు వేడిగా ఉండేలా చూసుకోవచ్చు. వంట వండటమే కాకుండా సూప్‌లు, గంజి వంటివి కూడా ఇందులో సులభంగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, ఉద్యోగం చేసే మహిళలకు ఈ కుక్కర్ చాలా ఉపయోగకరం.

వంటగది మరింత స్మార్ట్‌గా:

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గృహిణులు, టెక్ ప్రియులు ఈ కొత్త ఆవిష్కరణను చూసి ఫిదా అవుతున్నారు. అయితే, ఈ గ్యాడ్జెట్ ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే, ఈ కుక్కర్ ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. కానీ భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని స్మార్ట్ హోమ్ పరికరాలు భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. వంటగదిని కూడా స్మార్ట్‌గా మార్చేస్తున్న ఇలాంటి పరికరాలు మన శ్రమను తగ్గించడమే కాకుండా సమయాన్ని కూడా ఎంతో ఆదా చేస్తాయి.

Also Read: గ్యాస్ స్టవ్‌కు పోటీగా డబుల్ ఇండక్షన్.. ఎల్‌పీజీ కొరత‌ను వాడేసుకుంటున్న ప్రెస్టీజ్ కంపెనీ!

ముఖ్య గమనిక:

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి గ్యాడ్జెట్స్ ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిని కొనుగోలు చేసుకొనేందుకు లింక్స్ కూడా ఇస్తున్నారు. అయితే, మీరు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ లింక్స్, వాళ్లు చూపించే వీడియోలు ఫేక్ కూడా కావచ్చు. వాటిని నమ్మి క్లిక్ చేసి డబ్బులు చెల్లిస్తే.. మోసపోతారు. ఈ కథనం ముఖ్య ఉద్దేశం.. పాఠకులకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. ఆయా సంస్థలతో బిగ్ టీవీ లైవ్ వెబ్ సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి.. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని మనవి.

Related News

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

Big Stories

Advertisement
×