E-Paper
Advertisement

Samsung Affordable Phones: శాంసంగ్ టాప్ 3 బడ్జెట్ ఫోన్స్.. రూ.11000 కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇవే

Samsung Affordable Phones: శాంసంగ్ టాప్ 3 బడ్జెట్ ఫోన్స్.. రూ.11000 కంటే తక్కువ ధరలో బెస్ట్ ఇవే
Advertisement

Samsung Affordable Phones| బడ్జెట్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇప్పుడు మంచి ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు తక్కువ ధరలో బలమైన బ్యాటరీ, మంచి కెమెరా, స్మూత్ పర్‌ఫామెన్స్ ఇస్తాయి. రూ.11,000లోపు బడ్జెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు బెస్ట్ శాంసంగ్ మోడల్స్ గురించి చూద్దాం. ఈ ఫోన్లన్నీ గెలాక్సీ F, గెలాక్సీ M సిరీస్‌కు చెందినవి. అన్నింటిలోనూ 50MP కెమెరా ఉంది. రోజువారీ వినియోగానికి బాగా సరిపోతాయి.

శాంసంగ్ గెలాక్సీ M07.. బడ్జెట్ ఆల్-రౌండర్

శాంసంగ్ గెలాక్సీ M07 చాలా బ్యాలెన్స్‌డ్ ఫోన్. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో దాదాపు రూ.8,399కి దొరుకుతోంది. 6.7 ఇంచ్ HD+ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 720*1600 పిక్సెల్స్. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. మిడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్‌తో వస్తుంది. రోజువారీ పనులు, లైట్ గేమింగ్ సులభంగా నడుస్తాయి. 50MP మెయిన్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 8MP సెల్ఫీ కెమెరా ఉంది. సాధారణ లైటింగ్‌లో మంచి ఫోటోలు వస్తాయి. 5000mAh బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F07.. తక్కువ ధర ఆప్షన్

Advertisement

ఈ లిస్ట్‌లో అతి తక్కువ ధర ఉన్న ఫోన్ గెలాక్సీ F07. ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.7,799కి దొరుకుతోంది. 6.7 ఇంచ్ PLS LCD డిస్‌ప్లే ఉంది. HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నాయి. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఉంది. MediaTek Helio G99 ప్రాసెసర్‌తో వస్తుంది. డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ + 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUI 7 ఇంటర్‌ఫేస్ ఉంది. స్మూత్, అప్‌డేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 5000mAh బ్యాటరీ + 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ M06 5G – బెస్ట్ 5G ఛాయిస్

ఈ లిస్ట్‌లో 5G సపోర్ట్ ఉన్న ఫోన్ Galaxy M06 5G. అమెజాన్‌లో సుమారు రూ.10,999కి దొరుకుతోంది. 6.7 ఇంచ్ HD+ LCD డిస్‌ప్లే ఉంది. రోజువారీ ఉపయోగానికి క్లియర్ విజువల్స్ ఇస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వరకు ఆప్షన్లు ఉన్నాయి. మల్టీటాస్కింగ్ సులభంగా జరుగుతుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. 5G కనెక్టివిటీ, స్మూత్ పనితీరు ఇస్తుంది. డ్యూల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP మెయిన్ + 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 8MP సెల్ఫీ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీ + 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Advertisement

Also Read: మనుషులపై జోకులు వేసే ఏఐలు.. మానవులకు నో ఎంట్రీ ప్లాట్‌ఫామ్.. చాలా ప్రమాదకరం

ఈ మూడు శాంసంగ్ ఫోన్లు తక్కువ ధరలో అద్భుతమైన వాల్యూ ఇస్తున్నాయి. గెలాక్సీ F07 అతి చౌకగా ఉంది. గెలాక్సీ M06 5G ఫాస్ట్ 5G కనెక్టివిటీ ఇస్తుంది. గెలాక్సీ M07 బ్యాలెన్స్‌డ్ ఆప్షన్. బలమైన బ్యాటరీ, మంచి కెమెరా, స్మూత్ పర్‌ఫామెన్స్ కావాలనుకునేవారు ఈ ఫోన్లను పరిగణనలోకి తీసుకోవచ్చు

ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కొనుగోలు చేసున్నప్పడు జాగ్రత్తగా చెక్ చేసి కొనాలని వినియోగదారులకు సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి పైన చెప్పిన ధరలు మారిపోయి ఉండవచ్చు. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×