E-Paper
Advertisement

స్మార్ట్ టీవీ మైక్ ఆన్‌లో ఉంటే ఏం జరుగుతుంది? ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ చెక్ చేయండి!

స్మార్ట్ టీవీ మైక్ ఆన్‌లో ఉంటే ఏం జరుగుతుంది? ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ చెక్ చేయండి!
Advertisement

Smart TV Privacy Tips: ఇంట్లో టీవీ ఆన్ చేసి సినిమాలు చూడటం నుంచి యూట్యూబ్‌లో వీడియోలు వెతకడం వరకు అన్నీ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయాయి. రిమోట్‌లో టైప్ చేయాల్సిన పని లేకుండా వాయిస్ ద్వారా ఒక్క మాట చెబితే చాలు.. కావాల్సిన కంటెంట్ స్క్రీన్‌పైకి వచ్చేస్తుంది. కానీ ఈ స్మార్ట్ సదుపాయం వెనుక మన ప్రైవసీకి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. టీవీలోని మైక్రోఫోన్ గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.

టీవీ మైక్ మన మాటలు వింటుందా?

వాయిస్ కంట్రోల్ ఉన్న స్మార్ట్ టీవీల్లో మైక్రోఫోన్ సాధారణంగా వేక్ వర్డ్ కోసం సిద్ధంగా ఉంటుంది. అంటే మనం వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేసే పదాన్ని చెప్పినప్పుడు అది స్పందిస్తుంది. ఆ తర్వాత ఇచ్చే వాయిస్ కమాండ్‌ను ప్రాసెస్ చేయడానికి సంబంధిత డేటా టీవీ తయారీ సంస్థ లేదా వాయిస్ సర్వీస్‌కు వెళ్లొచ్చు. అందుకే ప్రైవసీ విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

అవసరం లేకపోతే ఆఫ్ చేయాలి:

Advertisement

మీరు వాయిస్ కమాండ్స్ పెద్దగా ఉపయోగించకపోతే టీవీ సెట్టింగ్స్‌లో Voice Recognition, Voice Assistant వంటి ఆప్షన్స్‌ను ఒకసారి చెక్ చేయండి. అవసరం లేకపోతే వాటిని డిసేబుల్ చేయవచ్చు. టీవీ బ్రాండ్, మోడల్‌ను బట్టి సెట్టింగ్స్ పేర్లు మారవచ్చు. కొన్ని మోడళ్లలో మైక్‌ను ఆఫ్ చేయడానికి ఫిజికల్ స్విచ్ కూడా ఉంటుంది.

Also Read: ఇంత తక్కువ ధరకేనా? Nothing Phone 3పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్!

వాయిస్ హిస్టరీని కూడా మర్చిపోవద్దు:

Advertisement

వాయిస్ అసిస్టెంట్‌ను ఉపయోగించే వారు ప్రైవసీ సెట్టింగ్స్‌ను తరచూ పరిశీలించడం మంచిది. కొన్ని డివైజ్‌లలో గతంలో ఇచ్చిన వాయిస్ కమాండ్స్ హిస్టరీను చూసే లేదా డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుంది. అవసరం లేని పాత వాయిస్ డేటాను తొలగించడం ద్వారా మీ డేటాపై మరింత నియంత్రణ ఉంచుకోవచ్చు.

మైక్ పనిచేస్తోందో ఎలా తెలుసుకోవాలి?

కొన్ని స్మార్ట్ టీవీల్లో మైక్రోఫోన్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఇండికేటర్ లైట్ కనిపిస్తుంది. అయితే అన్ని మోడళ్లలో ఈ సదుపాయం ఉండదు. కాబట్టి.. మీ టీవీ మోడల్‌కు సంబంధించిన ప్రైవసీ సెట్టింగ్స్, యూజర్ మాన్యువల్‌ను ఒకసారి పరిశీలించడం మంచిది. అవసరం లేని సమయంలో వాయిస్ ఫీచర్‌ను ఆఫ్ చేయడం ఉత్తమం.

మైక్ ఆఫ్ చేస్తే టీవీ పని చేయదా?

ఇదే అసలు సందేహం. మైక్ లేదా వాయిస్ అసిస్టెంట్‌ను ఆఫ్ చేసినా టీవీ సాధారణంగానే పనిచేస్తుంది. రిమోట్‌తో ఛానెల్స్ మార్చుకోవచ్చు. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్స్‌ను కూడా ఎప్పటిలాగే ఉపయోగించవచ్చు. కేవలం వాయిస్ కమాండ్స్ ద్వారా టీవీని కంట్రోల్ చేసే సదుపాయం మాత్రమే నిలిచిపోతుంది. వాయిస్ కంట్రోల్ మీకు పెద్దగా అవసరం లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకోవడం ఉత్తమమైన పని.

Also Read: ఇంత తక్కువ ధరకి ఇలాంటి ల్యాప్‌టాప్స్ వస్తున్నాయా? ట్రెండింగ్‌లో ఉన్న 5 మోడల్స్‌ ఇవే!

Tags

Related News

అచ్చం మేకప్ బాక్స్ లాగే ఉంటుంది.. 35 క్రిస్టల్స్‌తో మోటోరోలా కొత్త రేజర్ ఫోన్ చూశారా?

ఆహా.. Viలో ఇంతటి సూపర్ ప్లాన్ ఉందా? జస్ట్ రూ.349కే అపరిమిత 5G, ఫ్రీ కాల్స్!

ఇంత తక్కువ ధరకేనా? Nothing Phone 3పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్!

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ హ్యారీ పాటర్ ఫోన్ టీజర్.. డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే!

రోజుకి రూ.6 ఖర్చుతో ఏడాదికి పైగా అన్‌లిమిటెడ్ కాల్స్, 824GB డేటా.. BSNL దిమ్మతిరిగే ఆఫర్!

ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!

ఇంట్లోని గాలిని శుభ్రంగా ఉంచుకోవాలా? బడ్జెట్ ఎయిర్ ప్యూరిఫయర్ వచ్చేసింది

Big Stories

Advertisement
×