E-Paper
Advertisement

ఇంత తక్కువ ధరకేనా? Nothing Phone 3పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్!

ఇంత తక్కువ ధరకేనా? Nothing Phone 3పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్ ఇచ్చిన అమెజాన్!
Advertisement

Nothing Phone 3: సాధారణంగా మనం ఏదైనా కొత్త ఫోన్ కొనాలని అనుకున్నప్పుడు ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ధరలు చూసి చాలాసార్లు వెనకడుగు వేస్తుంటాం. ముఖ్యంగా నథింగ్ బ్రాండ్ ఫోన్లు వాటి యూనిక్ డిజైన్‌తో అందరినీ ఆకట్టుకుంటాయి. కానీ, ధర కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే Nothing Phone 3 ప్రియులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ప్రస్తుతం భారీ తగ్గింపు లభిస్తోంది. లాంచ్ అయిన సమయంలో దీని ధర సామాన్యులకు అందనంత దూరంలో ఉండేది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ధర భారీగా పడిపోయింది. రూ.79,999 పెట్టి కొనలేకపోయిన వాళ్లకు ఇది మంచి ఛాన్స్.

ఈ Nothing Phone 3 ఫోన్ ఒరిజినల్ ప్రైస్ రూ.79,999 కాగా ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.51,999కే లిస్ట్ చేశారు. అంటే.. నేరుగా రూ.28,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీనికి తోడు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే వారికి అదనంగా మరో రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు రూ.30,000 వరకు తగ్గుతుంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఇంకా తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.

Advertisement

Also Read: జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

Nothing Phone 3 కేవలం లుక్స్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ లోనూ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో ఇది వస్తుంది. దీంతో గేమ్స్ ఆడినా, పెద్ద పెద్ద యాప్స్ వాడినా ఎలాంటి లాగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. ముందు వెనుక గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల ఫోన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. 12 జీబీ ర్యామ్‌తో మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతుంది.

Advertisement

ఇందులో కెమెరా సెటప్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. వెనుక వైపు మూడు కెమెరాలు ఉండగా, ముందు వైపు సెల్ఫీల కోసం ఒకటి ఉంది. విశేషం ఏంటంటే.. ఈ నాలుగింటిలోనూ 50 మెగాపిక్సెల్ సెన్సార్లే వాడారు. ప్రైమరీ కెమెరాతో పాటు పెరిస్కోప్ టెలీఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ కెమెరా అన్నీ అద్భుతమైన ఫొటోలను అందిస్తాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్ కూడా దీని ప్రత్యేకత.

రోజంతా ఫోన్ వాడే వారికి ఇందులోని 5500mah బ్యాటరీ సరిపోతుంది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో కేవలం గంట లోపే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిపోతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. నథింగ్ సంస్థ ఈ ఫోన్‌కు ఏకంగా ఐదేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అంటే రాబోయే కొన్నేళ్ల వరకు ఫోన్ అప్‌డేటెడ్‌గా ఉంటుందన్నమాట.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ హ్యారీ పాటర్ ఫోన్ టీజర్.. డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

అచ్చం మేకప్ బాక్స్ లాగే ఉంటుంది.. 35 క్రిస్టల్స్‌తో మోటోరోలా కొత్త రేజర్ ఫోన్ చూశారా?

ఆహా.. Viలో ఇంతటి సూపర్ ప్లాన్ ఉందా? జస్ట్ రూ.349కే అపరిమిత 5G, ఫ్రీ కాల్స్!

స్మార్ట్ టీవీ మైక్ ఆన్‌లో ఉంటే ఏం జరుగుతుంది? ప్రైవసీ కోసం ఈ సెట్టింగ్ చెక్ చేయండి!

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ హ్యారీ పాటర్ ఫోన్ టీజర్.. డిజైన్ చూస్తే మతిపోవాల్సిందే!

రోజుకి రూ.6 ఖర్చుతో ఏడాదికి పైగా అన్‌లిమిటెడ్ కాల్స్, 824GB డేటా.. BSNL దిమ్మతిరిగే ఆఫర్!

ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!

ఇంట్లోని గాలిని శుభ్రంగా ఉంచుకోవాలా? బడ్జెట్ ఎయిర్ ప్యూరిఫయర్ వచ్చేసింది

Big Stories

Advertisement
×