E-Paper
Advertisement

స్పీకర్ ఛాంబర్‌లో అత్యవసరంగా భేటీ.. గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మేటరేంటి?

స్పీకర్ ఛాంబర్‌లో అత్యవసరంగా భేటీ.. గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మేటరేంటి?
Advertisement

Telangana Assembly: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఘటన వ్యవహారం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఉదయం స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశాల ప్రారంభంలో జరిగిన ఘటనల నేపథ్యంలో సీఎం-డిప్యూటీ సీఎంలు ఆయన్ని కలిసి పరామర్శించారు.

అసెంబ్లీలో కీలక పరిణామం

సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉండనున్నాయి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని విపక్షం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేశారు. నెక్ట్స్ ఏంటి? ఎవరిపై చర్యలు ఉంటాయన్న దానిపై అసెంబ్లీ లాబీల్లో నేతల మధ్య రకరకాల చర్చలు మొదలయ్యాయి.

Advertisement

ఈ క్రమంలో మంగళవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ని ఆయన ఛాంబర్‌లో కలిశారు సీఎం రేవంత్‌రెడ్డి. పరిణామాలపై లోతుగా చర్చించిన సీఎం, జరిగిన ఘటనల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్పీకర్‌ని ఓదార్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామన్నారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

బాధ్యులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడే ఉన్నారని తెలుస్తోంది. అసెంబ్లీ తొలి రోజు సోమవారం అసెంబ్లీ ఆవరణలో దాడులకు దిగిన బీఆర్ఎస్ నేతలు, మహిళా అధికారుల ఎదుట అంగీలు విప్పుకొని అనుచితంగా ప్రవర్తించారు. అంతేకాదు ఏకంగా స్పీకర్‌ని అసభ్యకర పదజాలంతో దూషించారు.

Advertisement

ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా వ్యవహరించారు నేతలు. ఈ పరిణామాలను పత్రికలు, టీవీలు, ప్రముఖంగా ప్రస్తావించాయి. తనను వ్యక్తిగతంగా దూషించటంతో స్పీకర్ కంట తడి పెట్టుకున్న దృశ్యాలు చూసి ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం అసెంబ్లీకి రాగానే స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన ఆయనను పరామర్శించారు.

ALSO READ: బీఆర్ఎస్‌ని ఏకేసిన మంత్రి సీతక్క.. మీది దళిత వ్యతిరేక నైజం, కవితను ఎందుకు బహిష్కరించారు?

Related News

బీఆర్ఎస్‌ని ఏకేసిన మంత్రి సీతక్క.. మీది దళిత వ్యతిరేక నైజం, కవితను ఎందుకు బహిష్కరించారు?

Telangana Assembly: హరీష్‌రావుపై స్పీకర్ ఆగ్రహం.. నా తల్లిని తిట్టారు.. నాకు ఆవేశం ఉండాలి?

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్ అరెస్ట్, మిగతా నేతలపై..

స్పీకర్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను: తాతా మధు!

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

Big Stories

Advertisement
×